Amol Palekar: సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
Amol Palekar : ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత అమోల్ పాలేకర్ తాజాగా ఏబీపీ ఐడియాస్ అఫ్ ఇండియా 2025 కార్యక్రమంలో మాట్లాడుతూ మంచి సినిమాలను బాక్స్ ఆఫీస్ లెక్కలతో పోల్చడం హిందీ సినిమా ఆపాలని అన్నారు.

ఇటీవల కాలంలో హిందీ సినిమాల ఎఫెక్ట్ బాగా తగ్గింది. సౌత్ సినిమాల హవా పెరగడంతో, హిందీ స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అంచనాలకు తగ్గ విధంగా ఆడడంలో, కలెక్షన్లను రాబట్టడంలో తడబడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు చిత్ర నిర్మాత అమోల్ పాలేకర్. మంచి సినిమాను నిర్వహించే క్రైటేరియా గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉందని, బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ సంపాదించే కలెక్షన్లను బట్టి మంచి మూవీని నిర్వచించకూడదని ఆయన అన్నారు.
కమల్ మూవీ గురించి ఎందుకు మాట్లాడరు ?
తాజాగా ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 కార్యక్రమంలో అమోల్ పాలేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాలో భారీ వసూళ్లు సాధిస్తున్నాయని, హిందీ సినిమాలు ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం లేదని ఆయనను ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ మంచి సినిమాలను, భారీ వసూళ్లు సాధించిన సినిమాలను కలిపి చూడకూడదని సమాధానం ఇచ్చారు.
Also Read: ఆ ఓటీటీలోకి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అమోల్ పాలేకర్ మాట్లాడుతూ "సినిమా బాగా ఆడిందని చెప్తారు. అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు ఆ మూవీ నచ్చింది అని అర్థం. కొంతవరకు అది నిజమే. బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల క్లబ్లో లేదా 500 కోట్ల క్లబ్లో సినిమా చేరిందని అంటారు. అయితే సినిమా అంటే కేవలం కలెక్షన్లు మాత్రమేనా? బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత బిజినెస్ జరిగింది? ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనేది కాదు. కేరళలో వాసుదేవ్ నాయర్ అని గొప్ప రచయిత ఉండేవారు. ఇటీవల కాలం చేశారు. ఆయన మీద ఓటీటీ కోసం ఒక ప్రాజెక్టును రూపొందించారు. అందులో మోహన్ లాల్, మమ్ముట్టి నుంచి మొదలు పెడితే కేరళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ చాలామంది నటించారు. కమల్ హాసన్ దానికి ప్రెసెంట్ గా వ్యవహరించారు. మరి దాని గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు? దక్షిణాదిలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే, దాని గురించి మాట్లాడట్లేదు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇలాంటి భారీ హైప్ ఉన్న సినిమాల వల్ల మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండా పోతున్నాయి. ఓ సినిమా డబ్బు సంపాదించడం కంటే ఎంతో గొప్పది. మంచి సినిమాలను వాటి వ్యాపారంతో ఎందుకు ముడి పెడుతున్నాము? మన అవగాహన కేవలం సినిమా చేసే వ్యాపారానికి మాత్రమే పరిమితం అవుతుందా? సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అది సంపాదించిన కలెక్షన్స్ గురించి మాత్రమే కాదు సినిమా అంటే" అంటూ సౌత్, నార్త్ కలెక్షన్ల గొడవపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సినిమాలో సామాజిక సమస్యలు
ఈ సందర్భంగా సినిమాల్లో ముఖ్యమైన సామాజిక సమస్యలను క్యాప్చర్ చేయకపోవడంపై ఎదురైన ప్రశ్నకు అమోల్ స్పందిస్తూ "మీడియా ఇలాంటి అంశాలను ప్రస్తావించకూడదా? టీవీ ఛానల్లో 90% కంటే ఎక్కువ వార్తలు రాజకీయాల గురించే ఉంటాయి. మన జీవితాల్లో రాజకీయాలు తప్ప ఇంకేమీ ఉండవా. సమస్యల గురించి, మనుషులు మంచిగా మారడానికి సహాయపడే కళ, పెయింటింగ్, సాహిత్యం అంటి ఇతర విషయాల గురించి కూడా మాట్లాడొచ్చు. కానీ దానికి బదులుగా మనం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం" అని అన్నారాయన. అలాగే తన రెండు సినిమాలు 'థాంగ్', 'దైరా'లను ఈ సందర్భంగా ఉదాహరించారు. అయితే ఈ సినిమాలు ట్రాన్స్ జెండర్స్ లాంటి సున్నితమైన విషయాలు ఉండటం వల్ల భారతదేశంలో రిలీజ్ కాలేదు.
Read Also : మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

