Mirai Release Date: ఆగస్టుకు వెళ్లిన 'మిరాయ్'... కలిసొచ్చే రెండు పండగలు... తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Mirai Release Date : తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రెండు పండగలు ఈ మూవీకి కలిసి రాబోతున్నాయి.

'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అద్భుతమైన గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. ఈ హీరో త్వరలోనే 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో యోధుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా మేకర్స్ నుంచి ఈ మూవీ రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
'మిరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్
'హనుమాన్' మూవీ ఇచ్చిన బూస్ట్ తో సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్న తేజా సజ్జా మరో సూపర్ హీరో మూవీతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'మిరాయ్' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నారు. ఈ రోల్ సూపర్ హీరో లాగా ఇంట్రెస్టింగ్ గా, డైనమిక్ గా ఉంటుందని తెలుస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'మిరాయ్' మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.
మేకర్స్ 'మిరాయ్' మూవీని పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో 2d, 3d ఫార్మాట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఓ కర్రను పట్టుకుని తీక్షణంగా చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Mark the date.#MIRAI ~ 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏, 𝟐𝟎𝟐𝟓 ❤️🔥❤️🔥❤️🔥
— People Media Factory (@peoplemediafcy) February 22, 2025
The rise of #SuperYodha begins in theatres worldwide 🥷 ⚔️
Get ready to witness a breathtaking action adventure on the big screen ❤️🔥#MIRAIonAUGUST1st 🔥
SuperHero @tejasajja123
Rocking Star @HeroManoj1 @RitikaNayak_… pic.twitter.com/AXHpJKMjwE
'మిరాయ్'కి కలిసొచ్చిన రిలీజ్ డేట్
'మిరాయ్' మూవీ మేకర్స్ మంచి రిలీజ్ డేట్ నే పట్టారు. ఈ మూవీకి రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డే సెలవులు కూడా కలిసి రాబోతుండడం విశేషం. కాబట్టి మూవీకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. పండగల టైంలో 'మిరాయ్' రిలీజ్ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరంగా, మర్చిపోలేని విధంగా ఉంటుందని అంటున్నారు. తేజా సజ్జా సరసన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ మూవీతో మేకర్స్ ప్రేక్షకులను పూర్తిగా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారని ప్రమోషనల్ కంటెంట్ ను చూస్తుంటే అర్థమవుతుంది. మరి సూపర్ యోధగా ప్రపంచాన్ని తేజా ఎలా కాపాడుతాడు అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఈ మూవీకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

