Farmer Protest: రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
Farmer Protest At Gandhi Bhavan: రుణమాఫీ కాలేదని తెలంగాణ గాంధీ భవన్‌లో నల్గొండ జిల్లా రైతుల నిరసన వ్యక్తం చేశాడు. తక్షణం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశాడు.

Telangana Latest News: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ వద్ద రైతు ధర్నా చేపట్టారు. తనకు రుణమాఫీ కాలేదని నల్గొండ జిల్లాకు చెందిన ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది.
రైతు రుణమాఫీ తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదంటూ ఓ రైతు ఏకంగా గాంధీభవన్ వద్దే ధర్నాకు దిగడం సంచలనంగా మారుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఆయన ధర్నా విజువల్స్‌ను బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది.
రుణమాఫీ కాలే : యాదగిరి
నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన తోట యాదగిరి గాంధీ భవన్‌లో నిరసన తెలిపారు. "రుణమాఫీ కావాలె కచ్చితంగా. బ్యాంకుకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు అన్నట్టుగానే వచ్చారు. రెండు లక్షలు మాఫీ చేస్తారని ఆశతో ప్రతి రైతు కానీ, కూలీలు కానీ, ప్రజలంతా రేవంత్ రెడ్డి గెలవాలని ఓట్లు వేసి గెలిపించనం. మా బ్యాంకు రుణం మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రెండు లక్షలు మాఫీ చేస్తే మిగతా డబ్బులు మేం కట్టుకుంటాం. ప్రగతి భవన్ నాకు తెలవదు. అందుకే గాంధీ భవన్ వద్దకు వచ్చినా. స్పష్టంగా నాకు రెండు లక్షల రుణమాఫీ చేయాలే. 55 క్వింటాల 85 కిలోలు అమ్మిన. దానికి బోనస్ కూడా ఇంత వరకు రాలే. ఇటు బోనస్ రాలే. అటు రుణమాఫీ కాలే. పింఛ్ కూడా లేదు. మా అబ్బాయికి కరోనా వస్తే 25 లక్షలు ఖర్చు అయింది. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే బ్యాంకుకు కట్టలేకపోయినం. నాకు ముగ్గురు పిల్లలు. అందుకే రెండు లక్షల రుణమాఫీ చేస్తే సంతోషం. వాళ్లు నాకు హామీ ఇచ్చే వరకు నేను కదలను. జైల్లో వేసినా నేను సిద్ధమే. " అని రైతులు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది. "
రుణమాఫీ కాలేదంటూ మండుటెండలో గాంధీ భవన్ మెట్ల మీద ధర్నాకు దిగిన వృద్ధ రైతు యాదగిరి.
— BRS Party (@BRSparty) February 21, 2025
రేవంత్ రెడ్డి పాలనలో రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ ఊసే లేదని ఆవేదన.
రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేసేశామని చెప్తున్నారు. నా… pic.twitter.com/Y5Eat3XKdk
బీఆర్‌ఎస్‌కు దొరికిన అస్త్రం
ఈ వీడియోను బీఆర్‌ఎస్ పార్టీతోపాటు ఆ పార్టీ నేతలంతా తమ హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందమైన కట్టుకథలు అబద్దాలతో రుణమాఫీపై ఇన్ని రోజులు ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న తప్పు ప్రచారం బహిర్గతమైందన్నారు. ఇప్పుడు గాంధీ భవన్‌లో నిరసన చేసిన యాదగిరికి ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. ఆరు గ్యారంటీలపై ప్రజలు గాంధీ భవన్‌కు వచ్చి నిలదీయక ముందే చేసిన తప్పులు సరి చేసుకొని హామీలు నెరవేర్చాలని సూచిస్తున్నారు. ఇంకా కళ్లు తెరవకుంటే గాంధీభవన్ నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు జనాలు క్యూకడతారని హెచ్చరించారు.
Also Read: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
నల్గొండ నుంచి వచ్చిన యాదగిరి పోరాటానికి హరీష్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలంతా కాంగ్రెస్ మోసాలపై కొట్లాడాలని పిలుపునిచ్చారు. వారికి అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని భరోసా ఇచ్చారు.
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారు.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 21, 2025
మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి… pic.twitter.com/gUU5PrsqMr





















