search
×

PM VIshwakarma Yojana: నగరాల్లో నివసించే ప్రజలకు కూడా పీఎం విశ్వకర్మ పథకం వర్తిస్తుందా, ఎవరు అర్హులు?

VIshwakarma Yojana Eligibility: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ప్రయోజనాలు నగరాల్లో నివసించే ప్రజలకు కూడా లభిస్తాయా?. ఈ ప్రశ్న చాలా మంది మనస్సుల్లో ఉంది.

FOLLOW US: 
Share:

PM VIshwakarma Yojana Details In Telugu: భారత ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాల అభివృద్ధి & సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రభుత్వ పథకాల నుంచి దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందిస్తుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలు & అవసరమైన వాళ్లకు సాయం చేయడమే ప్రభుత్వ పథకాల లక్ష్యం. దీనిలో భాగంగా, భారత ప్రభుత్వం 2023 సంవత్సరంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించింది.

సాంప్రదాయ వృత్తులను కొనసాగిస్తున్న పేద ప్రజలు ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో, ప్రోత్సాహక మొత్తంతో పాటు ప్రభుత్వం శిక్షణను కూడా అందిస్తుంది, కళాకారుల నైపుణ్యం మరింత పెంచుతుంది. అయితే, సాంప్రదాయ వృత్తులను కొనసాగిస్తున్న వాళ్లు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు కాబట్టి, ఈ పథకం గ్రామీణులకే వర్తిస్తుందా లేదా నగరాల్లో నివసించే ప్రజలకు కూడా ప్రయోజనాలు లభిస్తాయా? అని చాలా మంది తరచుగా ఆరా తీస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాయి.

పథకం ప్రయోజనాలను పట్టణ ప్రజలు పొందగలరా?
2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించినప్పుడే పథకానికి సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారయ్యాయి. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు. అయితే, ఈ పథకంలో చేరడానికి 'నివాసిత ప్రాంతం'పై ఎటువంటి షరతులు లేవు. అంటే, ఈ పథకం కింద ప్రయోజనాలు అందించడానికి, లబ్ధిదారుడు నగరంలో నివసిస్తున్నాడా లేదా గ్రామంలో నివసిస్తున్నాడా అనేది చూడరు. లబ్ధిదారుడు, నిర్దేశిత 18 సాంప్రదాయ వృత్తులలో దేనిని ఆచరిస్తున్నా, నివాసిత ప్రాంతంతో సంబంధం లేకుండా అర్హుడు (PM Vishwakarma Yojana Eligibility) అవుతాడు.         

18 రకాల సాంప్రదాయ వృత్తులు
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద భారత ప్రభుత్వం 18 సాంప్రదాయ వృత్తులను నిర్దేశించింది. అవి... పడవ తయారీదారులు, ఐరన్‌ వర్కర్లు, స్వర్ణకారులు, చెప్పులు తయారు చేసే వాళ్లు, విగ్రహ తయారీదారులు, రాళ్లను పగలగొట్టేవాళ్లు, తాళాలు తయారు చేసే వాళ్లు, బొమ్మల తయారీదారులు, దుస్తులు ఉతికేవాళ్లు, దండలు తయారు చేసే వాళ్లు, దర్జీలు, చాపలు & బుట్టల తయారీదారులు, క్షురకులు, టూల్ కిట్ తయారీదారులు, చేపల వల తయారీదారులు. ఈ 18 సాంప్రదాయ వృత్తులలో కార్మికులకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనాలు లభిస్తాయి.

పీఎం విశ్వకర్మ యోజన ప్రయోజనాలు ‍‌ఇవీ ‍‌(PM Vishwakarma Yojana Benefits)
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద, భారత ప్రభుత్వం లబ్ధిదారులకు శిక్షణ ఇస్తుంది. శిక్షణ సమయంలో ప్రతి రోజూ రూ. 500 స్టైఫండ్‌ మంజూరు చేస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత, టూల్ కిట్ కొనడానికి రూ. 15,000 ఆర్థిక సాయం చేస్తుంది.             

మరో ఆసక్తికర కథనం: సింగిల్‌ ప్రీమియంతో జీవితాంతం పింఛను - ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ 

Published at : 21 Feb 2025 02:50 PM (IST) Tags: Government Scheme pm vishwakarma Vishwakarma Yojana Eligibility details Utility News in Telugu

ఇవి కూడా చూడండి

PF Withdrawal: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

PF Withdrawal: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!

New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!

10-Minute Smartphone Delivery: స్మార్ట్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే 10 నిమిషాల్లో హోమ్‌ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు

10-Minute Smartphone Delivery: స్మార్ట్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే 10 నిమిషాల్లో హోమ్‌ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు

Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్‌ ఫ్రంట్‌ క్రొకోడైల్‌ ఫెస్టివల్‌

Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్‌ ఫ్రంట్‌ క్రొకోడైల్‌ ఫెస్టివల్‌

Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్‌ ఇచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్‌ ఇచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు

Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు

Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన

Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన

RC16 First Look: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... 'పెద్ది' ఫస్ట్‌ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?

RC16 First Look: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... 'పెద్ది' ఫస్ట్‌ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?

Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు