అన్వేషించండి

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ

Andhra Pradesh Group 2 Exam | రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన అర్ధం చేసుకున్నాం... పరీక్ష నిర్వహణ పై లీగల్ గా చర్చిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Nara Lokesh On Group 2 Exam | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన లకు మంత్రి నారా లోకేష్  రెస్పాండ్ అయ్యారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జరగడానికి కేవలం ఒక్కరోజు మిగిలి ఉన్న సమయం లో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించడం తో నిరుద్యోగులు ఓ మేర ఊరట చెందుదుతున్నారు. " గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వెయ్యాలంటూ తనకు ఎన్నో మెసేజ్ లు, అభ్యర్ధనలు వచ్చాయని వారి సమస్యను పరిష్కరించడానికి  తమ లీగల్ టీం తో చర్చిస్తున్నామని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామంటూ " నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. దీనితో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు తమకు మంచి జరుగుతుందన్న రిలీఫ్ వ్యక్తం చేస్తున్నారు. 

899 పోస్టులు -92250 మంది అభ్యర్థులు - ఏంటీ గ్రూప్ 2 సమస్య 
గత ప్రభుత్వం  2 ఆగస్టు 2023 లో కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని "రోస్టర్ " విధానం లో మార్పులు చేస్తూ GO నెంబర్ 77 రిలీజ్ చేసింది. దీని ద్వారా " ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ అండ్ సర్వీస్ రూల్స్ నెంబర్ 1996 " లో ఉంటే  22,22A , 22B క్లాజ్ లను సవరించి హారిజంటల్ రిజర్వేషన్ లను అమలు చేస్తామని ప్రభుత్వం విధి విధానాలను పేర్కొంది. ఈ GO తర్వాత వచ్చే ఎ నోటిఫికేషన్ అయినా ఈ రూల్స్ నే ఫాలో కావాలి. విచిత్రంగా అదే వైసీపీ 4 నెలల తర్వాత డిసెంబర్ 2023 లో 899 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అందులో ఈ రోస్టర్ విధానం లో రిజర్వేషన్ లు అమలు చేయడం పక్కన పెట్టేసింది.

అభ్యర్డుల నిరసనల మధ్యే హడావుడిగా 2024 ఫిబ్రవరి లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసారు. అప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయినా సరే అప్పటి ప్రభుత్వం తాను చేసిన పొరబాటును సరి చేసుకోకుండా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేసింది. ఎందుకంటే అదే ఏడాది మే లో ఎన్నికలు ఉన్నాయి. తమ పాలన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మరక ఇష్టం లేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్న ఆరోపణ ఉంది. ఈ ప్రిలిమ్స్ కి 4 లక్షల మంది వరకూ అభ్యర్డులు హాజరరైతే 92250 మంది మెయిన్స్ కు  ఉత్తీర్ణత సాధించారు.  వీరికి ఆదివారం నాడు మెయిన్స్ పరీక్షల జరగనుంది. దీనినే వాయిదా వేసి రోస్టర్ విధానం అమలు చేసి మళ్లీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటూ తీర్పు ఇచ్చింది. దీనితో అభ్యర్థులందరూ మంత్రి నారా లోకేష్ కు మెసేజ్ ల ద్వారా తమ అభ్యర్థులు తెలిపారు. విశాఖపట్నం కర్నూల్ కలెక్టరేట్ల వద్ద తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందిస్తూ నారా లోకేష్  లీగల్ టీం తో చర్చిస్తున్నామని  ఈ సమస్య పరిష్కారానికి ఉన్న అన్ని దారులను పరిశీలిస్తున్నామని ప్రకటన రిలీజ్ చేయడంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
Embed widget