Venkatesh Maha Dharna : స్టార్ హీరో సమాధానం చెప్పాలి - ప్లకార్డుతో హీరో ఇంటి ముందు వెంకటేష్ మహా ధర్నా
Venkatesh Maha Anger Tales : స్టార్ హీరో కారణంగా తనకు నష్టం ఏర్పడిందని వెంకటేష్ మహా చెబుతున్నారు. తనకు సమాధానం చెప్పాలంటూ హీరో ఇంటి ముందు ప్లకార్డుతో మౌన పోరాటానికి దిగారు. ధర్నా చేపట్టారు.
స్టార్ హీరో వల్ల తాను నష్టపోయానని యువ దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) అంటున్నారు. స్టార్ హీరో అంటే హీరో వల్ల కాదు... స్టార్ హీరో సినిమా వల్ల నష్టపోయారట. తనకు ఏర్పడిన నష్టానికి స్టార్ హీరో సమాధానం చెప్పాలని ఆయన కోరుతున్నారు. 'నీ సినిమా వల్ల నేనూ నష్టపోయాను, నా నష్టానికీ సమాధానం కావాలి' అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని హీరో ఇంటి ముందు ధర్నాకు దిగారు. మౌన పోరాటం మొదలు పెట్టారు. ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! ఎందులో? అనే వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరో వీరాభిమానిగా వెంకటేష్ మహా!
Venkatesh Maha Character In Anger Tales Web Series : 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రాలకు, 'మోడర్న్ లవ్ హైదరాబాద్' వెబ్ సిరీస్ - అంథాలజీలో ఓ కథకు దర్శకత్వం వహించిన వెంకటేష్ మహా... నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్', నాని 'అంటే సుందరానికీ' సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. లేటెస్టుగా 'యాంగర్ టేల్స్' వెబ్ సిరీస్ / అంథాలజీలో నటుడిగా కనిపించారు.
నాలుగు కథల సమాహారంగా 'యాంగర్ టేల్స్' తెరకెక్కింది. అందులో 'బెనిఫిట్ షో' కథలో వెంకటేష్ మహా ప్రధాన పాత్ర పోషించారు. స్టార్ హీరో వీరాభిమాని పాత్ర రంగ చేశారు. కథ విషయానికి వస్తే... ఫేవరెట్ హీరో సినిమా బెనిఫిట్ షో ప్లాన్ చేస్తాడు రంగ. రూ. 70 రూపాయల టికెట్టును రూ. 1200లకు అమ్ముతాడు. రాత్రి ఎనిమిది గంటలకు వేయాలన్న బెనిఫిట్ షో, పన్నెండు గంటలకు కూడా పడదు. సినిమా హిట్టా? ఫ్లాపా? అనే విషయంలో షోకి వచ్చిన యువ రాజకీయ నేతకు, రంగకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. అభిమాన హీరో సినిమా ఎలాగైనా సరే హిట్ అవుతుందని పందెం కాసిన రంగకు తీవ్ర అవమానం ఎదురు అవుతుంది. దాంతో హీరో ఇంటి దగ్గరకు వెళ్లి ధర్నాకు దిగుతాడు. అదీ సంగతి!
కమర్షియల్ సినిమాపై కామెంట్స్...
కమర్షియల్ హీరోకు ఫ్యాన్ క్యారెక్టర్!
వెంకటేష్ మహా పేరు రెండు మూడు రోజులుగా విపరీతంగా వినబడుతోంది. దానికి కారణం 'కెజియఫ్', అందులో హీరో క్యారెక్టర్ గురించి ఆయన చేసిన కామెంట్స్. ఏ కమర్షియల్ సినిమా గురించి అయితే వెంకటేష్ మహా కామెంట్ చేశారో... అలాంటి కమర్షియల్ సినిమాలు చేసే స్టార్ హీరోకి అభిమానిగా 'యాంగర్ టేల్స్'లో ఆయన క్యారెక్టర్ చేయడం విశేషం.
Also Read : 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
వెంకటేష్ మహా కాంట్రవర్సీ కారణంగా 'యాంగర్ టేల్స్'కు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. కన్నడ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 'యాంగర్ టేల్స్' స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 'యాంగర్ టేల్స్'లో వెంకటేష్ మహా క్యారెక్టర్ బూతులు మాట్లాడుతుంది. అందువల్ల, ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.
'కెజియఫ్' మీద కామెంట్ చేయడంతో కన్నడ సినిమా పరిశ్రమ నుంచి... యశ్, ప్రశాంత్ నీల్ అభిమానులే కాకుండా, ప్రభాస్ & ఎన్టీఆర్ అభిమానులు సైతం వెంకటేష్ మహా తీరును తప్పుబట్టారు. ట్రోల్స్ చేస్తూ సెటైర్స్ వేస్తున్నారు.
Also Read : ‘ఆస్కార్’ ఖర్చులతో 8 సినిమాలు చెయ్యొచ్చు, ‘RRR’ టీమ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్!