Jabardasth Faima: 'జబర్దస్త్' ఫైమాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది... వదల్లేకపోతున్న 'పటాస్' ప్రవీణ్ - స్టేజిపై వెక్కి వెక్కి ఏడుపు
Patas Praveen Jabardasth: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో "నన్ను నెగెటివ్ చెయ్యాలని చూస్తున్నావ్" అంటూ ఫైమా ఫైర్ అవ్వగా, స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రవీణ్.
'పటాస్' ఫైమా గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'పటాస్' మాత్రమే కాదు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఈ అమ్మడు తన టాలెంట్ తో అవకాశాలు కొట్టేసి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే 'పటాస్' చేస్తున్నప్పుడే మరో కంటెస్టెంట్ అయిన ప్రవీణ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టుగా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, షోలు చేయడం లాంటివి చేశారు. కానీ ఆ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో ఇద్దరికీ మధ్య చెడింది. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వీరిద్దరూ మరోసారి గొడవ పడుతూ కనిపించారు.
ఫైమా ఫైర్... ప్రవీణ్ ఎమోషనల్
జనవరి 12న ఆదివారం మధ్యాహ్నం1 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోకి సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఫైమా - ప్రవీణ్ మధ్య వివాదం నెలకొన్నట్టుగా చూపించారు. ప్రవీణ్ మాట్లాడుతూ "నేను సిన్సియర్ గా, నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్టనర్ అయితే చాలా బాగుంటుంది అని ప్రపోజ్ చేశాను. కానీ నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో... నా లైఫ్ నేను చూసుకుంటా అని నన్ను దూరం పెట్టింది" అని ప్రవీణ్ చెప్పడం ఆ ప్రోమోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ప్రవీణ్ ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని సస్పెన్స్ లో పెట్టి, ఫైమా రియాక్షన్ చూపించారు. ఫైమా మాట్లాడుతూ "నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు. నువ్వేదో నన్ను నెగిటివ్ చేయాలని చూస్తున్నావ్. అది మాత్రం నాకు గ్యారంటీగా అర్థమైంది" అని చెప్పింది. ఆ తర్వాత ప్రవీణ్ "నేను నిన్ను అనలేదు" అని చెప్పగా, "పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను. అయినా కూడా మళ్లీ ఈ టాపిక్ తీసి నన్ను నెగిటివ్ చేస్తున్నావ్. లైఫ్ లాంగ్ నేను నీతో అస్సలు మాట్లాడదలచుకోలేదు" అంటూ తేల్చి చెప్పింది. దీంతో ప్రవీణ్ ఎమోషనల్ అవుతూ "మీకు నాకు ఏ సంబంధం లేదు. తర్వాత నుంచి నా గురించి తననేమీ అడగకండి. అలాగే తన గురించి నన్నేమీ అడగకండి" అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇక చివరిగా ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ? అంటూ ప్రోమోని ఎండ్ చేశారు.
బిగ్ బాస్ తర్వాతే బ్రేకప్
ఫైమా బిగ్ బాస్ కి వెళ్లే ముందు ప్రవీణ్ తో బాగానే ఆమె బంధం బాగానే ఉండేది. కానీ బిగ్ బాస్ కి వెళ్లి, వచ్చిన తర్వాత మాత్రం ఇద్దరూ పెద్దగా కలిసి కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇద్దరం దూరమయ్యామని స్వయంగా ఫైమా చెప్పింది. "ప్రస్తుతం మేము బాగానే మాట్లాడుకుంటున్నాం. మా రిలేషన్ ఏంటి అనే విషయంపై మాకు క్లారిటీ ఉంది" అని వెల్లడించింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వీళ్ళిద్దరి బ్రేకప్ గురించి ప్రస్తావన రావడంతో ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు