News
News
X

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan On The Ghost Movie : నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించిన సినిమా 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న విడుదల కానున్న సందర్భంగా సోనాల్ చౌహాన్‌తో ఇంటర్వ్యూ

FOLLOW US: 

సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. ఎక్కువగా గ్లామర్ డాల్ క్యారెక్టర్లలో కనిపించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... 'ది ఘోస్ట్'లో యాక్షన్ రోల్ చేశారామె. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రమిది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. అక్టోబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్‌తో ఇంటర్వ్యూ... 

హాయ్ సోనాల్... ఎలా ఉన్నారు?
నేను బావున్నాను. 'ది ఘోస్ట్' విడుదల కోసం ఎదురు చూస్తున్నాను

కొంత విరామం తర్వాత తెలుగు తెరకు వస్తున్నట్లు ఉన్నారు?
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం విరామం తీసుకుంది. నాకు కూడా విరామం తప్పలేదు. ఈ ఏడాది 'ఎఫ్ 3'లో అతిథి పాత్ర చేశాను. కథానాయికగా 'ది ఘోస్ట్' చిత్రంతో అక్టోబర్ 5న వస్తున్నాను. మధ్యలో హిందీ సినిమాలు చేశా. అయితే, నా ఫస్ట్ లవ్ మాత్రం తెలుగు సినిమాలే!

తొలుత కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా తీసుకున్నారు. మీకు అవకాశం ఎలా వచ్చింది?
నటీనటుల పరంగా 'ది ఘోస్ట్'లో చాలా మార్పులు జరిగిన సంగతి మీకు తెలుసు. యాక్షన్ రోల్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నా బకెట్ లిస్టులో అదొకటి. ప్రతి హీరోయిన్ యాక్షన్ చేయాలనుకుంటుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జునకు జోడీగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉందని నాకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. 

News Reels

సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. దాని కోసం ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు?
శారీరకంగా, మానసికంగా చాలాఛాలెంజింగ్ రోల్ ఇది. దీని కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేశా. రెండో రోజు కాలి వెలికి గాయమైంది. డాక్టర్ చిన్న గాయం కాదు, పెద్ద ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పారు. ఎక్స్ రే తీశాక ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. నాకు ఎలాగైనా సరే ఈ సినిమా వదులుకోవడం ఇష్టం లేదు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేశా. వెపన్ ట్రైనింగ్, ఎంఎంఎలో ట్రైనింగ్ తీసుకున్నా. సుమారు రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. 

ఈ సినిమా కోసం గన్స్ తొలిసారి పట్టుకున్నారా?
మా నాన్న పోలీస్ ఆఫీసర్. అందువల్ల, చిన్నప్పటి నుంచి గన్స్ అలవాటే. ఈ సినిమా కోసం ఏకే 47 వంటివి పట్టుకోవడం, లోడ్ చేయడం, హ్యాండిల్ చేయడంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నా. దర్శకుడు ప్రవీణ్ సత్తారును కలవడానికి వెళితే ఆయన టేబుల్ మీద చాలా గన్స్ ఉన్నాయి. గన్ ఇచ్చి పట్టుకోమన్నారు. రెండు నిమిషాలు చూశారు. ఆ తర్వాత వెంటనే ఓకే చేశారు. నా జీవితంలో అటువంటి ఆడిషన్ ఎప్పుడూ జరగలేదు. పక్కింటి అమ్మాయి లేదంటే గ్లామర్ డాల్ రోల్ చేయలేదు. తొలిసారి డిఫరెంట్ రోల్ చేశా. 

'ది ఘోస్ట్'తో మీపై గ్లామర్ డాల్ ముద్ర చెరిగిపోతుందని అనుకుంటున్నారా?
ఈ సినిమాతో నేనొక గ్లామర్ డాల్ మాత్రమే కాదని, అంతకు మించి నాలో పొటెన్షియల్ ఉంటుందని ప్రేక్షకులు చూస్తారు. ఇండియాలో హీరోలకు వెరైటీ రోల్స్ దొరుకుంటాయి. హీరోయిన్లపై ఒక ముద్ర వేస్తారు. నన్ను గ్లామర్ డాల్ చేశారు. విలేజ్ రోల్ ఇస్తే మేకప్ లేకుండా నటించడానికి నేను రెడీ.  

నాగార్జున స్టార్ హీరో. సీనియర్ కూడా! ఆయనతో నటించడం నెర్వస్‌గా ఫీలయ్యారా?
నాగార్జున గారితో సినిమా చేయడం, నటించడం డ్రీమ్. ఆ కల 'ది ఘోస్ట్'తో తీరింది. ఆయన్ను కలసినప్పుడు కాస్త నెర్వస్ ఫీలయ్యా. అయితే... పది నిమిషాల తర్వాత ఆయనదీ నా వయసే అనిపించింది. హీ ఈజ్ వెరీ యంగ్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. 

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

నాగార్జున కింగ్ ఆఫ్ రొమాన్స్. ఈ సినిమాలో మీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? 
'వేగం' పాటలో మా కెమిస్ట్రీ చూశారా? అటువంటి రొమాంటిక్ సీన్స్ కొన్నే ఉన్నాయి సినిమా యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఎక్కువ స్కోప్ దొరకలేదు. నాగార్జున గారితో మంచి రొమాంటిక్ సినిమా చేయాలనుంది. ఈ సినిమాలో నేను రెండు మేజర్ యాక్షన్ సీన్స్ చేశా. 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా ఎలా తీశారు? ఆయన వర్కింగ్ స్టైల్ గురించి...
నా కెరీర్‌లో సెట్స్‌లో డైలాగులు చేంజ్ చేయడం చూశా. ఆఖరికి కెమెరా ముందు డైలాగులు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే... రెండు నెలల ముందు డైలాగులతో సహా బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండటం ఈ సినిమాకు చూశా. ప్రవీణ్ సత్తారుకు ఏం తీయాలో చాలా క్లారిటీగా తెలుసు. ప్రతి విషయంలో ఆయన పర్ఫెక్ట్. ఇదొక డ్రీమ్ టీమ్. 

ప్రభాస్, నాగార్జున, వెంకటేష్... స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మీ టైమ్ స్టార్ట్ అయ్యిందని అనుకోవచ్చా?
బాలకృష్ణ గారితో, ఈ స్టార్ హీరోలతో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్టార్ హీరోలతో సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు రావాలని కోరుకుంటున్నాను. 

Also Read : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు

Published at : 24 Sep 2022 06:46 PM (IST) Tags: Praveen Sattaru The Ghost Movie Sonal Chauhan Interview Sonal Chauhan On Nagarjuna Ghost Heroine Sonal Interview

సంబంధిత కథనాలు

Gruhalakshmi November 28th: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్

Gruhalakshmi November 28th: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్

Guppedanta Manasu November 28th: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

Guppedanta Manasu November 28th: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

టాప్ స్టోరీస్

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో  సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్