Dussehra 2022 Telugu Movie Releases : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు
దసరాకు తెలుగులో మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో 'స్వాతిముత్యం' ఒకటి. ఆ సినిమా దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ ఈ పోటీ గురించి నేడు ఇంటర్వ్యూలో మాట్లాడారు.
![Dussehra 2022 Telugu Movie Releases : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు Chiranjeevi Vs Nagarjuna Vs Swati Mutyam - We are coming with Chiranjeevi but we are not in competition with him, says Swati Mutyam Director Lakshman K Krishna Dussehra 2022 Telugu Movie Releases : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/24/53ca9ccb22e6f864edd9fb3e2fb5a0b11664011939124313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయ దశమి బరిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' విడుదల కావడం కన్ఫర్మ్. విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ 5న విడుదల అవుతున్న మరో తెలుగు సినిమా 'స్వాతిముత్యం'.
'స్వాతిముత్యం' సినిమాతో నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు గణేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాతో గోదావరి కుర్రాడు లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన 'లాస్ట్ విష్', 'కృష్ణమూర్తి గారింట్లో' షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆ తర్వాత 'సదా నీ ప్రేమలో' ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశారు. ఇప్పుడు 'స్వాతిముత్యం'తో వెండితెరకు వస్తున్నారు. భారీ సినిమాల మధ్యలో తన తొలి సినిమా విడుదల అవుతుండటంపై ఆయన స్పందించారు.
''విజయ దశమికి సినిమాను విడుదల చేయాలనేది పూర్తిగా నిర్మాతలు తీసుకున్న నిర్ణయం. 'స్వాతిముత్యం' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కాబట్టి పండగ వాతావరణంలో విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దసరాకు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే... చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు మా విడుదల కావడం కొంచెం భయంగా ఉన్నా సంతోషంగా ఉంది'' అని లక్ష్మణ్ కె. కృష్ణ పేర్కొన్నారు.
నా అభిమాన హీరో చిరంజీవి గారు : లక్ష్మణ్ కె. కృష్ణ
మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన కథానాయకుడు అని లక్ష్మణ్ కె. కృష్ణ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రాలేదు. కానీ, ఆయన సినిమా విడుదల అవుతున్న రోజే దర్శకుడిగా నా తొలి సినిమా విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. మేం చిరంజీవి గారితో వస్తున్నాం కానీ... ఆయనకు పోటీగా రావడం లేదు'' అని చెప్పారు.
Also Read : బాబాయ్ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్
'స్వాతిముత్యం' సినిమా విషయానికి వస్తే... పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. సీనియర్ నటుడు నరేష్ వీకే, రావు రమేష్, సుబ్బరాజు, 'వెన్నెల' కిషోర్, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.
నిజం చెప్పాలంటే... తొలుత జూలైలో 'స్వాతిముత్యం'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఆగస్టుకు వాయిదా వేశారు. ఆగస్టు 12న నితిన్, కృతి శెట్టిల 'మాచర్ల నియోజకవర్గం', ఆ తర్వాత రోజైన 13న నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' సినిమాలు వస్తుండటంతో వాయిదా వేశారు. పండక్కి నాలుగైదు సినిమాలకు స్కోప్ ఉంటుంది. అందుకని, విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)