Rana Naidu Web Series: బాబాయ్ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్
Rana Naidu Web Series: జైల్లో చేతులకి సంకెళ్లతో బాగా తెల్ల గడ్డంతో ఇందులో వెంకీ కనిపించారు. తండ్రి మీద చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోతున్న పాత్రలో రానా నటించారు.
Rana Naidu Web Series: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానానాయుడు’. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఇందులో చాలా డిఫరెంట్ లుక్లో వెంకటేష్ కనిపిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఇందులో ఉన్నాయి. రానా, వెంకీ తండ్రి కొడుకులుగా ఇందులో నటించారు. జైల్లో చేతులకి సంకెళ్లతో బాగా తెల్ల గడ్డంతో ఇందులో వెంకీ కనిపించారు. తండ్రి మీద చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోతున్న పాత్రలో రానా నటించారు. తండ్రి వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్స్ ఇందులో చూపించారు. నేను మీ నాన్నని అని వెంకటేష్ అంటే నువ్వేమైనా మంచి పనులు చేశావా నాన్న అని పిలిపించుకోవడానికి అని రానా అంటాడు. మునుపెన్నడూ వెంకటేష్ ని ఈ లుక్లో చూసి ఉండరు.
Also Read: 'సీతారామం' సినిమా డిలీటెడ్ సీన్ చూశారా
పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ ఇది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం తెలుగు సినీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. "దగ్గుబాటి Vs దగ్గుబాటి కి సమయం వచ్చేసింది. అయితే ఇది మీ రోజువారీ కుటుంబ నాటకం కాదు. బాబాయ్, అబ్బాయ్‌లను ‘రానానాయుడు’లో చూడండి" అని నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మామ, అల్లుడు కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడకతప్పదు. భారతీయ నెటీవీటికి తగినట్టు ఇందులో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఇప్పటి వరకి వీరిద్దరూ కలిసి ఏ సినిమా కూడా చెయ్యలేదు. 'దృశ్యం 2', 'F3', 'నారప్ప' సినిమాతో వెంకటేష్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు మూడు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. వినూత్న కథాంశంతో ఉన్న సినిమాల్లో నటించేందుకు వెంకీ చాలా ఆసక్తి చూపిస్తారు.
Also Read: ఐశ్వర్యారాయ్ మరోసారి తల్లి కాబోతుందా?
It’s time for the ultimate Daggubati VS. Daggubati! 😎
— Netflix India (@NetflixIndia) September 24, 2022
But this is not your everyday family drama. Watch this uncle-nephew duo go head-to-head in #RanaNaidu, ARRIVING SOON! 🕺🏻💃🏻#Tudum pic.twitter.com/w9kfNF2c09