Sita Ramam Deleted Scene: 'సీతారామం' సినిమా డిలీటెడ్ సీన్ చూశారా
Sita Ramam Deleted Scene: సూపర్ క్లాసిక్ ప్రేమ కావ్యం సీతారామం డిలిటెడ్ సీన్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడికి, ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ. ఎంతో అధ్బుతమైన ఈ దృశ్యకావ్యం విడుదలై నిన్నటితో(సెప్టెంబర్ 23) 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్ ని విడుదల చేసింది. 1.50 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రామ్(దుల్కర్), విష్ణు శర్మ(సుమంత్) మధ్య గొడవ జరగడం చూపించారు. ఒక చీకటి గది నుంచి బయటకి వచ్చిన రామ్ అక్కడ సుమంత్ ని చూసి తనతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడతాడు. అందులో విష్ణు శర్మ గెలుస్తాడు.
విష్ణు సర్ మీరే మళ్ళీ గెలిచారు అని రామ్ అంటాడు. దీంతో ఏడుస్తూ కోపంగా విష్ణు రామ్ ని కొట్టేందుకు తన మీదకి కలబడతాడు. అంతా నీ వల్లే మనం ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నామో కూడా తెలియదు అని కోపంగా రామ్ మీద చెయ్యి చేసుకునేందుకు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు విష్ణుని పక్కకి లాగటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డిలీటెడ్ సీన్ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లిస్ట్లో ఉంది. హృద్యమైన ఈ ప్రేమ కావ్యానికి అందరూ ఫిదా అయిపోయారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఈ సినిమా చాలా బాగుందని చాలా రోజుల తర్వాత అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని అన్నారు.
Also Read: ఐశ్వర్యారాయ్ మరోసారి తల్లి కాబోతుందా?
‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ‘సీతారామం’ సినిమాను నిర్మించారు. అందమైన ఈ దృశ్యకావ్యం ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రసారం అవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
ఆగస్టు 5 న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.75 కోట్ల వరకు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లోనూ రిలీజ్ అయ్యింది. రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు. ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా హృద్యంగా ప్రేమకథను తెరకెక్కించారని పలువురు ప్రశంసించారు.
Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram