అన్వేషించండి

Nani's Meet Cute Trailer: క్యూట్‌గా 'మీట్ క్యూట్' ట్రైలర్ - మనసుని హత్తుకునే సంభాషణలతో నాని వెబ్ సీరిస్

హీరో నాని నిర్మాతగా దీప్తి గంటా దర్శకత్వంలో ఆంథాలజీగా రూపొందించిన 'మీట్ క్యూట్' వెబ్ సీరిస్ ట్రైలర్ వచ్చేసింది. టైటిల్‌కు తగినట్లే భలే క్యూట్‌గా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు ఓటీటీ లకు కూడా ప్రేక్షకులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ లు బాగా కలసి వస్తున్నాయి. ఓటీటీ ల ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. ఓటీటీ లలో వచ్చిన చాలా వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందాయి కూడా. త్వరలో మరో తెలుగు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి వచ్చేస్తోంది. హీరో నాని నిర్మాతగా దీప్తి గంటా దర్శకత్వంలో ఆంథాలజీగా రూపొందించిన 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. 

నాని నిర్మాతగా..

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో  వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన, ఆకాంక్షా సింగ్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో సోని లివ్ లో మీట్ క్యూట్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే..

ఏదైనా రిలేషన్ లో గొడవలు వస్తే వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ఎలా సంతోషంగా ముందుకుకెళ్ళాలి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుత యువత ఆలోచనా ధోరణికి అద్దం పట్టే విధంగా కూడా కథ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో యువత జీవితాల్లోని పడే సంఘర్షణ, అయోమయం, అనుమానాలు ఇలా ఎన్నో అంశాలు ఇందులో కనిపిస్తాయి.

"నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ల మధ్య జరిగే అందమైన సంభాషణలు, ఆ జ్ఞాపకాలు అవన్నీ జీవితాంతం గుర్తుండిపోతాయి” అంటూ నాని వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే "ఈ మనిషితో గొడవపడటం అనవసరం అనుకున్నప్పుడే బంధాలు ఫెయిల్ అవుతాయి. మనం ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం" అంటూ సాగే సత్యరాజ్ సంభాషణలు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా బాగుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 25 నుంచి సోని లీవ్ లో ప్రసారం కానుంది. 

Also Read: తండ్రి ఆస్పత్రిలో ఉన్నా మరో ప్రాణం కాపాడిన మహేష్ - ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు!

ఇక నాచురల్ స్టార్ నాని అంతకముందు 'వి', 'టక్' జగదీష్' లాంటి సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ ను తెచ్చుకున్నాయి. ఇటీవల నాని 'అంటే సుందరానికీ' సినిమా లో నటించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడితో 'దసరా' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Embed widget