Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులకు రూ. 11,600 మించి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే డిస్కషన్స్ జరుగుతున్నట్టు వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిర్చి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు చర్చించారు.
ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఎంత వరకు సాయం చేయొచ్చు అనే అంశాన్ని చర్చించారు. ఇలా ఆదుకుంటూనే ఎగుమతులు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాట్లాడినట్టు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. ప్రస్తుతం అన్ని పెట్టుబడులు కలుపుకొని మిర్చి రైతుకు క్వింటాకు రూ.11,600 ఖర్చు అవుతున్నట్టు రాష్ట్రం తెలిపింది. అంతుకు మించి వచ్చేందుకు సాయం చేసేందుకు కేంద్రం రెడీగా ఉందని రామ్ తెలిపారు.
Also Read: చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు- జగన్‌కు దమ్ములేదు- రెండు పార్టీలపై షర్మిల ఫైర్
అంతర్జాతీయంగా ఉన్న సమస్యలను అధిగమించి మిర్చి ఎగుమతులు ఎలా పెంచుకోవాలి, ఐకార్ ద్వారా రైతులను ఎలా ఆదుకోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం మార్కెట్ ధరకు, రైతుల ఖర్చలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎగుమతిదారులతో కూడా సమావేశమై వారి నుంచి కూడా సూచనలు తీసుకోవాలని తేల్చారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కేంద్రమంత్రి సమావేశమై మిర్చి రైతులపై చర్చించినట్టు కేంద్రమంత్రులు తెలిపారు.
Also Read: మిర్చి ధరల పతనంపై చంద్రబాబు క్లారిటీ- కేంద్రం దృష్టికి రైతుల కష్టాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

