అన్వేషించండి
PM Kisan Yojana : ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల! స్టేటస్ ఇలా చెక్ చేయండి
PM Kisan Yojana : పిఎం కిసాన్ 20వ విడత విడుదల కానుంది. రైతులు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన కిస్తీ విడుదల! స్టేటస్ ఇలా చెక్ చేయండి
1/6

రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా 6000 రూపాయల సహాయం అందిస్తారు. ఇది మూడు వాయిదాలలో వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 19 వాయిదాలు విడుదలయ్యాయి.
2/6

20వ వాయిదా ఎప్పుడు వస్తుందని రైతుల మనసుల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. ప్రభుత్వం 4 నెలల వ్యవధిలో డబ్బులు చెల్లిస్తుంది. ఈ ప్రకారం చూస్తే, జులై చివరి వరకు లేదా ఆగస్టు ప్రారంభంలో 20 వ వాయిదా నగదు రైతుల ఖాతాలో జమ కావచ్చు. అయితే, ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
3/6

రైతులు తమ స్టాటస్ ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దీని కోసం ప్రధాన మంత్రి కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.inని సందర్శించాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ విభాగంలోకి వెళ్లి నో యువర్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.
4/6

ఆ తర్వాత ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసిన తర్వాత మీ తదుపరి వాయిదా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. వాయిదా విడుదలైన తర్వాత కూడా స్టేటస్ పెండింగ్‌లో కనిపిస్తే కొన్ని పనులు పూర్తి చేయాలి.
5/6

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ప్రయోజనం పొందడానికి మీ ఈ-కేవైసీ పూర్తి చేయాలి. దీనితోపాటు ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ చేయడం తప్పనిసరి. భూమి రికార్డులలో ఎటువంటి లోపాలు ఉండకూడదు. వీటిలో ఏదైనా అసంపూర్తిగా ఉంటే, మీ ఖాతాలో నగదు పడకపోవచ్చు.
6/6

అందుకే 20 వ వాయిదా నగదు విడుదల చేయడానికి ముందు ఈ పనులన్నీ పూర్తి చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మీకు వచ్చే నగదు ఆగిపోవచ్చు. మీ పనులన్నీ పూర్తయినప్పటికీ డబ్బులు రాకపోతే, మీరు కిసాన్ యోజన హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా సమీపంలోని వ్యవసాయ శాఖకు వెళ్లి ఈ విషయం గురించి తెలియజేయవచ్చు.
Published at : 16 Jul 2025 08:55 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















