అన్వేషించండి
Revanth Reddy: నా జీవితంలో ఈరోజు చరిత్రాత్మకం - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Raithu Runa Mafi | ఎన్నికల హామీల్లో భాగంగా రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా చెప్పిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ప్రకటించారు.
రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
1/5

తన జీవితంలో ఈరోజు (జూన్ 21వ తేదీ) చారిత్రాత్మకమైన రోజు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2/5

6 మే 2022 నాడు వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ లక్షలాది మంది తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అని వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.
3/5

నా సారథ్యంలో తెలంగాణ మంత్రివర్గం రైతుల రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాట ఇచ్చినట్లుగా తెలంగాణ రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు.
4/5

తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లలో రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. అది కూడా వడ్డీలు పెరిగి అన్నదాతలు ఇబ్బంది పడితే రుణమాఫీ జరిగిందన్నారు.
5/5

కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే దీనిపై విధివిధానాలు రూపొందించి ప్రకటన చేస్తామన్నారు.
Published at : 22 Jun 2024 12:24 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విశాఖపట్నం
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















