అన్వేషించండి

Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్

Bengaluru Techie: బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Bengaluru Techie Atul Subhash Wife Arrested: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ (Atul Subhash) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతుల్ భార్య నిఖితా సింఘానియాను ఆదివారం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిఖితాను అరెస్ట్ చేయగా.. ఆమె తల్లి, సోదరున్ని యూపీలోని అలహాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు ఓ ఉన్నతాధికారి ధ్రువీకరించారు. కాగా, తన భార్య వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. 

కాగా, తన సోదరుడు అతుల్ సుభాష్‌ను.. అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు అనురాగ్ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగుళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో ఆదివారం వారిని అరెస్ట్ చేశారు.

40 పేజీల లేఖ

బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) భార్య వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు ఆయన ఏకంగా 40 పేజీల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీస్ అధికారులు తెలిపారు.  యూపీకి చెందిన ఆయన ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్‌లో ఉంటున్నారు. భార్యతో తాను అనుభవిస్తోన్న మానసిక క్షోభకు సంబంధించి లేఖ రాసి ఈ - మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. అనంతరం తన నివాసంలోనే అర్ధరాత్రి ఉరి వేసుకుని మృతి చెందారు.

ఆ ఆవేదనతోనే..

అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. 'నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తుంది. వారు దాన్ని వాడుకొనే నన్ను నాశనం చేస్తున్నారు. ఇది ఒక విష వలయంలా మారింది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నా.' అంటూ అందులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, భరణం ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుటే భార్య అతడిని అనడం.. న్యాయమూర్తి నవ్వడం సుభాష్‌ను తీవ్రంగా బాధించిందని అతుల్ బంధువులు ఓ వార్త సంస్థకు వెల్లడించారు. తన సోదరునికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు అతుల్ సోదరుడు తెలిపారు.

 

 

Also Read: Pakistan first Hindu police officer: పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లలో ఒకే ఒక్కడు రాజేందర్ - హిందువే కానీ పాకిస్థానీ !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Embed widget