ప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్
సినీ రచయిత చిన్ని క్రిష్ణ అల్లు అర్జున్ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్ర అని ఆవేశంతో వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మొదటి సినిమాకు తానే రచయితను అని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా ఆయన్ను జైలు అధికారులు ఆలస్యంగా విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి (Actor Allu Arjun lawyer Ashok Reddy) స్పందిస్తూ.. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆర్డర్స్ లో స్పష్టంగా ఉందని అన్నారు. ఆలస్యంగా విడుదల చేయడంపై జైలు అధికారులు, ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలు నుంచి విడుదల చేసే విషయంలో పోలీసులు చాలా గోప్యత పాటించారు. ఎవరి ఊహకు అందకుండా అల్లు అర్జున్ ను పోలీసులు ప్రిజన్స్ అకాడమీ ద్వారం నుంచి బయటకు తీసుకొచ్చారు.