Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహనసేవలు చూసి తరిస్తున్న భక్తులు!
Mahashivaratri Brahmotsavam 2025 : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వైభవం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు

Mahashivaratri Brahmotsavam in Srisailam2025: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వైభవం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి శోభతో వెలిగిపోతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమైన బ్రహ్మోత్సాలు కన్నులపండువగా సాగుతున్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 20 గురువారం రోజు ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం తరపున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఫిబ్రవరి 21 శుక్రవారం సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
రెండో రోజైన ఫిబ్రవరి 20 గురువారం భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు..మూడో రోజు సాయంత్రం హంసవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రికి పురవీధుల్లో గ్రామోత్సవం జరగనుంది.
Also Read: విష్ణువుకే కాదు శివుడుకీ దశావతారాలున్నాయి - అవేంటంటే!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఇంకా వేలాది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. శ్రీశైలంలో పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు.
భక్తులంతా తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవస్థాన అధికారులు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఈ రోజుల్లో కేవలం అలంకార దర్శనాలు మాత్రం కల్పిస్తున్నట్లు ఈవో చెప్పారు. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నామని..ఇరుముడితో వచ్చేవారికి ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, పాలు, అల్పాహారం, మజ్జిగ, బిస్కెట్స్ అందిస్తున్నట్టు పేర్కొననారు. ఉదయం 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదం అందుబాటులో ఉంచామని.. కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులకు మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తన్నాయని వారికి దేవస్థానం సహకారం ఉందని చెప్పుకొచ్చారు.
Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!
అటవీ మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. భరతనాట్యం, వేణుగానం, కూచిపూడినృత్యం, ఆంధ్రనాటకం, నృత్య హరిచంద్ర నాటకాలతో పాటూ శివరాత్రి వైభవంపై ప్రవచనాలు భక్తులను అలరించాయి.
బ్రహ్మోత్సవాల్లో ఫిబ్రవరి 20న జరిగిన భృంగివాహన సేవను చూసి భక్తులు తరించారు. భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి సుగంధపుష్పాలతో అలంకరించారు. అనంతరం పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ నృత్య కార్యక్రమం భక్తులను అలరించింది. గ్రామోత్సవం, కోలాటం, భజనంలు, తప్పెట్లు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ రాజగోపురం నుంచి గంగాధర మంటపం మీదుగా గ్రామోత్సవం సాగింది.
Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

