ABP Network Ideas Of India 2025: "మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: ABP నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ముంబైలో ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ స్వాగత ప్రసంగం చేశారు.

Ideas Of India 2025: ముంబైలో ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ గాయని సంజీవని భేలాండే ఆలపించిన సరస్వతీ వందనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ సదస్సులో స్వాగత ప్రసంగం చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో చర్చించే అంశాలను ప్రస్తావించారు.
ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ పూర్తి ప్రసంగం ఇదే :
"లేడీస్ అండ్ జెంటిల్మెన్,
ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025కి స్వాగతం.
ఓ కొత్త సరిహద్దు పిలుస్తోంది...!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- AI కోట్లాది మంది నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వ్యాధుల తీవ్రతను అంచనా వేయటంలో డేటా మైనింగ్ ఉపయోగపడుతోంది. రెండో అంతరిక్ష పోటీ మొదలైంది. ఈసారి భారత్ కూడా అందులో ఉంది. మరణమే లేకుండా జీవించటంపై సాధ్యాసాధ్యాల ను శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.
మనల్ని ఆపుతోంది ఏంటి.?
మనమే.
మానవ జాతిని AI ఓ పనికిరాని, అధ్వాన్నమైన, అంతరించిపోయే జాతిలా మారుస్తుందని మారుతుందని భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. సమస్త మానవాళిని AI అంతం చేస్తుందని భయపడుతున్నారు. రాజకీయ నాయకులు, విదేశీ కార్పొరేట్ శక్తులు మన ఆన్‌లైన్ డేటా మైనింగ్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అంతరిక్షం కూడా మన భూమి మీద జియో పాలిటిక్స్‌ను ప్రతిబింబిస్తోంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ వయస్సు మీద పడిన తమ జనాభాను పోషించడం లో ఇబ్బంది పడుతున్నాయి.
పెద్ద ప్రశ్నలు ఉన్న చోటే కొన్ని సమాధానాలు ఉంటాయి.
ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేలా AI మీద నియంత్రణ ఉండాలి. డేటా మైనింగ్ టూల్స్ వాడటం ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలు గుర్తించగలగాలి. అంతరిక్షానికి ఉన్న కఠిన నిబంధనలు మన భూమి విషయంలోనూ అమలు చేయాలి. మన జీవన ప్రమాణాలు పెరుగుతున్న ఈ సమయాన ప్రజలు వర్కింగ్ లైఫ్ ను మరింత పెంచుకోవాలి. కార్యాలయాలు కూడా మరింత సౌకర్యవంతంగా మారాలి. మనకు నాయకత్వం, సహకారం, కొంచెం కామన్ సెన్స్ అవసరం.
మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి.
అదే మనల్ని తర్వాతి దశకు తీసుకువెళ్తుంది.
ధన్యవాదాలు."
ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ ఇంగ్లిష్ స్పీచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2047లో భారతదేశం తన స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలను సమీపిస్తున్న తరుణంలో ఏబీబీ నెట్‌వర్క్ ప్రతి ఏడాది ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తూ వస్తోంది. దేశం అసాధారణ పురోగతిని ఉజ్వల భవిష్యత్తు సామర్థ్యాన్ని మరింతగా హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
"Humanity's Next Frontier" అనే ఇతివృత్తంతో నాల్గో ఎడిషన్‌ను ఏబీపీ నిర్వహిస్తోంది. ప్రపంచ వేదికపై వ్యాప్తి చెందుతున్న భారతదేశం ప్రాభవాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మంచి ఆలోచనలు కలిగిన నాయకులు, ఆవిష్కర్తలు, మార్పును తీసుకురాగలిగే వారిని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ఈ శిఖరాగ్ర సమావేశం. ఇక్కడ జరిగే చర్చలు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతాయి. మరిన్ని సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడతాయి. డైనమిక్ భవిష్యత్తుకు మార్గం వేస్తాయి. ఇదే ఐడియాస్ ఆఫ్ ఇండియా లక్ష్యం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

