IPL 2025 GT VS DC Result Updates: గుజరాత్ రికార్డు ఛేజింగ్.. టోర్నీలో ఐదో విజయంతో సత్తా.. బట్లర్ సెంచరీ మిస్, ప్రసిధ్ కు 4 వికెట్లు
గుజరాత్ మళ్లీ టాప్ లేపింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించిన గుజరాత్.. టోర్నీలో ఐదో విజయాన్ని సాధించింది. దీంతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

IPL 2025 GT Record Chasing: గుజరాత్ అద్బుతం చేసింది. ఐపీఎల్ చరిత్రలో తమ అత్యుత్తమ ఛేదనను చేసింది. తొలిసారి 200+ పరుగుల ఛేదనను పూర్తి చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ లో శనివారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 203 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (39)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను తిరిగి దక్కించుకుంది. కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు.
సమష్టిగా రాణించిన బ్యాటర్లు..
బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్ పై ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా రాణించాడు. అందరూ తలో చేయి వేయడంతో 200 పరుగుల మార్కును దాటింది. ఆరంభంలో అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18, 3 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (31), కేఎల్ రాహుల్ (28) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వెనుదిరిగిన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (31), అశుతోష్ శర్మ (37)లతో కలిసి జట్టును ముందుకు నడిపారు. ఇక ఢిల్లీ బ్యాటర్లకు అద్భుతమైన శుభారంభాలు లభించినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేదు. చివర్లో కుల్దీప్ యాదవ్ ఆడిన తొలి బౌండరీ కొట్టడంతో 200 పరుగుల మార్కును దాటింది. ఇక మిగతా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ కు తలో వికెట్ దక్కింది.
Jos Buttler's handbook on how to play yorkers 🤌
— IndianPremierLeague (@IPL) April 19, 2025
How good was he against Mitchell Starc in that over?
Updates ▶️ https://t.co/skzhhRVXOV#TATAIPL | #GTvDC | @gujarat_titans | @josbuttler pic.twitter.com/TefoBUA4g6
Tale of two halves: Krishna strikes, Ashutosh strikes back!
— IndianPremierLeague (@IPL) April 19, 2025
🎥 Watch the eventful 18th over 🔽#TATAIPL | #GTvDC
సూపర్ భాగస్వామ్యం..
ఛేజింగ్ లో గుజరాత్ కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ శుభమాన్ గిల్ (7) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్ (36) తో కలిసి బట్లర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఢిల్లీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న వీరిద్దరూ చూడముచ్చటైన బౌండరీలు సాధించారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షెర్ఫేన్ రూథర్ ఫర్డ్ (43) తో కలిసి ఇన్నింగ్స్ ను బట్లర్ నిర్మించాడు. రూథర్ ఫర్డ్ ఒక వైపు సపోర్ట్ గా నిలబడినా, బట్లర్ మాత్రం ధాటిగా ఆడాడు. ఈ దశలో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బట్లర్ ధాటిగా ఆడాడు. ఇక చివర్లో రూథర్ ఫర్డ్ ఔట్ అవడంతో మూడో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది, ఆ తర్వాత రాహుల్ తెవాటియా (11 నాటౌట్)తో కలిసి బట్లర్ జట్టుకు విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టి, తెవాటియా జట్టును విజయతీరాలకు చేర్చాడు.




















