Telangana Bandh: నేడు తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్-అన్ని పార్టీల సపోర్ట్ !
BC groups bandh: నేడు(శనివారం) తెలంగాణ బీసీ సంఘాల బంద్ కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి.రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఈ ఆందోళన జరుగుతోంది.

All Parties Supported Telangana BC Groups Bandh: తెలంగాణలో బీసీ సంఘాలు నేడు(శనివారం) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరగుతోంది. హైకోర్టు ఇటీవల జారీ చేసిన స్టే ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సంఘాలు ప్రకటించాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జారీ చేసిన జీవోపై హైకోర్టు అక్టోబర్ 9న స్టే విధించింది. దీనికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బీసీలు ఇప్పటికీ సామాజిక వివక్షకు గురవుతున్నారని, వారికి సమాన హక్కులు, గౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టుబడుతున్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన (SEEEPC) సర్వే నిర్వహించామని కాంగ్రెస్ పేర్కొంది. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ) ఈ బంద్‌ను నిర్వహిస్తోంది. జేఏసీ చైర్మన్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఈ ఆందోళన జరుగుతోంది. ప్రజలు శాంతియుతంగా పాల్గొనాలని, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని కోరారు. ఆర్టీసీ బస్సులు నడపకూడదని పిలుపునిచ్చారు.
బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
— Jagruthi Talks (@jagruthi_Talks) October 17, 2025
'బంద్ ఫర్ జస్టిస్' కు మద్దతునివ్వాలని కోరుతూ 'తెలంగాణ బీసీ జేఏసీ' చైర్మన్ ఆర్. కృష్ణయ్య లేఖ
*సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు*
బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్,… pic.twitter.com/viq8h01rzA
టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. పార్టీ నాయకులందరూ పాల్గొంటారని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీజేపీకి వ్యతిరేకంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూనియన్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రధాని మోదీతో మాట్లాడి బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వం లీగల్ ఎక్స్‌పర్ట్‌లతో చర్చించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని సూచించారు. కవిత 'న్యాయం కోసం బంద్'కు పూర్తి మద్దతు తెలిపారు. సీపీఐ, ఇతర సంఘాలు మద్దతు ప్రకటించాయి.
42% బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న బీజేపీ వైఖరికి నిరసనగా రాష్ట్ర బంద్! శనివారం బీసీ నేతల బంద్ పిలుపుకు కాంగ్రెస్ మద్దతు!!
— Telangana Congress (@INCTelangana) October 17, 2025
శ్రీ భట్టి విక్రమార్క గారు – గౌరవ ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu pic.twitter.com/BIYxQxltfY
తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంద్ పేరుతో అక్రమాలు, ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.





















