Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
3 Idiots Style: బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లో ఆమిర్ ఖాన్ పాత్ర రాంచో ప్రసవ ఘటనను గుర్తుచేస్తూ, ముంబైలో ఓ యువకుడు నిజ జీవితంలో హీరో అయ్యాడు.

Mumbai Man Helps Deliver A Baby At Railway Station 3 Idiots Style: బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లో ఆమిర్ ఖాన్ పాత్ర తమ డీన్ కుమార్తెకు డాక్టర్ సాయంతో ప్రసవం చేయిస్తారు.ఇది సినిమాటిక్ అసలు జరగదని అనుకుంటారు. కానీ ఘటన తరహాలోనే ముంబైలో ఓ యువకుడు నిజ జీవితంలో హీరో అయ్యాడు. కదులుతున్న రైలులో మహిళకు పురుటి నొప్పులు రావడంతో, వికాస్ బెండ్రే అనే యువకుడు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలు ఆపి, వీడియో కాల్‌లో డాక్టర్ సూచనలతో ప్లాట్‌ఫామ్ మీదే డెలివరీ చేశాడు. తల్లి , బిడ్డ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వికాస్‌ను "రియల్ లైఫ్ రాంచో" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటన అక్టోబర్ 15, 2025 రాత్రి 1 గంటలో ముంబైలోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద జరిగింది. మహిళ తన కుటుంబంతో రైలులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ముందురోజు రాత్రి ఆమె కుటుంబం సమీప ఆసుపత్రికి వెళ్లినా సాయం లభించలేదు. ఇంటికి చేరుకోవాలని రైలు ఎక్కారు. రైలు కదులుతుండగా నొప్పులు తీవ్రమవడంతో సహాయం కోసం కేకలు వేశారు.
A man didn’t wait for anyone.
— ShoneeKapoor (@ShoneeKapoor) October 16, 2025
At 1 AM in a Mumbai local, when chaos broke out as a woman went into labour and everyone froze
— Vikash Bendre stepped up.
He pulled the chain.
Got a doctor on video call.
And helped deliver a baby inside a train. 🚆👶
No training. No… pic.twitter.com/okL60jYpf8
వికాస్ బెండ్రే, ఇతర ప్రయాణికులు ఆమె బాధను గమనించారు. బిడ్డ తల సగం బయటకు వచ్చిన సమయంలో వికాస్ ఎమర్జెన్సీ చైన్ లాగి రైలు ఆపాడు. ఆంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో, వికాస్ ఒక మహిళా డాక్టర్‌తో వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. డాక్టర్ స్టెప్ బై స్టెప్ సూచనలు ఇవ్వడంతో, వికాస్ ప్లాట్‌ఫామ్ మీదే డెలివరీ చేశాడు. మెడికల్ ట్రైనింగ్ లేకున్నా, ధైర్యంగా ముందుకు వచ్చాడు. డెలివరీ తర్వాత తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు.
At 1 AM in a Mumbai local, chaos broke out as a woman went into labour. While everyone froze, Vikas Bendre acted.
— Kashmiri Hindu (@BattaKashmiri) October 16, 2025
He pulled the chain. Got a doctor on video call. Helped deliver a baby in a train.
No training. No hesitation. No slogans. Just humanity. ❤️#MumbaiLocal pic.twitter.com/KJcPL0ZIv2
సోషల్ మీడియాలో వికాస్‌ను 'రియల్ లైఫ్ హీరో', 'రాంచో' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంట్లలో: "ఇలాంటి ధైర్యవంతులు ఇప్పుడు అరుదు", "ఆయన తల్లిదండ్రులు గర్వపడతారు", "3 ఇడియట్స్ సినిమా నిజమైంది" వంటివి. ఇది సమాజంలో సాయం చేసే మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు.





















