అన్వేషించండి

Vizag Google Data Center: వైజాగ్‌లో గూగుల్‌ డాటా సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు రావా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటీ?

Vizag Google Data Center: వైజాగ్‌లో గూగుల్‌ తన భారీ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికి ఈ మధ్యే ఒప్పంద కూడా జరిగింది. కానీ వీటి వల్ల ప్రయోజనం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందులో నిజమెంత?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Vizag Google Data Center: విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిష్టాత్మక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌ ఒప్పందం జరిగింది. దీని కోసం ప్రభుత్వం భారీగా రాయితీలు ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఉపాది, ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని, కానీ తక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్న డాటా సెంటర్ ఏర్పాటుతో ప్రయోజనం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంపై దాడి చేస్తోంది. గూగుల్ డాటా సెంటర్‌ వల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువని కానీ ప్రభుత్వం రాయితీలు మాత్రం భారీగా ఇస్తోందని ఆరోపిస్తోంది. నిజంగానే డాటా సెంటర్‌ల వల్ల ఉద్యోగాలు రావా, ఆర్థిక ప్రయోజనాలు ఉండవా? వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డాటా సెంటర్లు అక్కడ జరిగిన ఆర్థిక ప్రగతిని ఓ సారి పరిశీలిద్దాం. 

 డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డాటా వంటి అత్యాధునిక సాంకేతికతలు విస్తరించడానికి డాటా సెంటర్లే కీలకంగా మారుతున్నాయి. ఈ 'సైలెంట్ పవర్ హౌస్‌లు' కేవలం డాటాను నిల్వ చేసే గోదాములుగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను ప్రేరేపించే శక్తివంతమైన ఇంజిన్‌లుగా ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా నుంచి ఆసియా పసిఫిక్ ప్రాంతం వరకు, డాటా సెంటర్లు ఊహించని స్థాయిలో ఆర్థిక పురోగతిని, భారీ పెట్టుబడులను అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తున్నాయి.

డాటా సెంటర్ల ద్వారా ఉపాధి అవకాశాల కల్పన అద్భుతంగా ఉందని ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా చెబుతుంది. అమెరికాలో 2017 నుంచి 2021 వరకు డాటా సెంటర్ సంబంధిత ఉద్యోగాలు జాతీయ సగటు వృద్ధి (2%) కంటే ఎంతో ఎక్కువగా, 20% పెరిగి 3.5 మిలియన్లకు చేరుకున్నాయి. 2016 నుంచి 2023 మధ్యకాలంలో, కేవలం డాటా సెంటర్లలోని ఉద్యోగాలు 60% పెరిగాయి, ఇది 3,06,000 నుంచి 5,01,000 వరకు ఉద్యోగాలకు పెరిగాయి.

ఈ ఉద్యోగాలు కేవలం సంఖ్యలో మాత్రమే కాక, నాణ్యతలో కూడా అత్యుత్తమంగా ఉన్నాయని స్టడీస్‌ చెబుతున్నాయి. ఇవి అధిక వేతనాలతో కూడుకున్నవి. ఒక డేటా సెంటర్ ఉద్యోగి వార్షిక వేతనం $100,000+ ఉండగా, నిర్మాణ దశలో పనిచేసే కార్మికులకు కూడా అధిక వేతనాలు అందుతున్నాయి.

డాటా సెంటర్ల ప్రత్యేకత వాటి 'మల్టిప్లైయర్ ఎఫెక్ట్'లో ఉంది. అంటే, ఒక డేటా సెంటర్లో ప్రత్యక్షంగా ఏర్పడే ప్రతి ఉద్యోగం, US ఆర్థిక వ్యవస్థలో సగటున 7.4 అదనపు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని PwC అధ్యయనం వెల్లడించింది. ఈ పరోక్ష ఉద్యోగాలు సప్లై చైన్, సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్, HVAC నిపుణులు, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ వంటి సహాయక పరిశ్రమలలో ఏర్పడతాయి.

నార్తర్న్ వర్జీనియా: ‘డాటా సెంటర్ ’ స్టోరీ

గ్లోబల్ డాటా సెంటర్ మార్కెట్‌లో వర్జీనియా రాష్ట్రం ప్రపంచ లీడర్‌గా నిలిచింది.

• గ్లోబల్ కెపాసిటీలో వాటా: ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాటా సెంటర్ కెపాసిటీలో 13% ఒక్క నార్తర్న్ వర్జీనియాలోనే ఉంది.
• ఆర్థిక ప్రభావం: 2023 నాటికి, ఈ ప్రాంతం $31 బిలియన్ GDPని ప్రభావితం చేసింది.
• టాక్స్ రెవెన్యూ: లౌడన్ కౌంటీలో 2023లో డాటా సెంటర్ల నుంచి పన్నుల రూపంలో $582 మిలియన్ల ఆదాయం వచ్చింది. ఇది 2021 నుంచి 170% పెరుగుదల. ఈ ఆదాయం పబ్లిక్ ఎడ్యుకేషన్, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య కార్యక్రమాలకు ఉపయోగపడుతోంది. ఇక్కడ కంప్యూటర్ ఎక్విప్‌మెంట్ నుంచి వచ్చే పన్ను మోటార్ వాహనాల అమ్మకాల పన్ను కంటే 2.5 రెట్లు ఎక్కువ.

అలాగే, నెబ్రాస్కాలో మెటా (Meta) చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ దశలోనే $3.1 బిలియన్ ఆర్థిక ప్రభావాన్ని చూపింది. ఆపరేషన్స్ ద్వారా ఏటా $232 మిలియన్ డైరెక్ట్ అవుట్‌పుట్ వస్తోంది. ఇక్కడ డేటా సెంటర్ల ఆస్తి పన్ను వ్యవసాయ భూమి కంటే 110 రెట్లు అధికం.

ఆసియా పసిఫిక్: ఎక్స్‌ప్లోసివ్ గ్రోత్

అమెరికా మాత్రమే కాదు, యూరప్‌లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, మధ్యప్రాచ్యంలో యూఏఈ (ఖజ్నా డాటా సెంటర్స్) వంటి దేశాలు కూడా డాటా సెంటర్లను ఆకర్షిస్తున్నాయి. ఆసియాలో, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు డాటా సెంటర్లు కీలకంగా మారాయి.
భారతదేశం, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలు పెట్టుబడులతో దూసుకుపోతున్నాయి.

• థాయిలాండ్: గూగుల్ $1 బిలియన్ పెట్టుబడితో 14,000 ఉద్యోగాలు, $4 బిలియన్ GDP వృద్ధిని అంచనా వేసింది.

• మలేషియా: గూగుల్ $2 బిలియన్ పెట్టుబడి ద్వారా 2030 నాటికి $3.2 బిలియన్ ఆర్థిక ప్రభావాన్ని, 26,500 ఉద్యోగాలను అంచనా వేసింది.

• భారతదేశం: ముంబై, చెన్నైలలో డాటా సెంటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. 

విశాఖపట్నంలో రూ. 10 బిలియన్ల గూగుల్ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో 10,000-15,000 తాత్కాలిక ఉద్యోగాలు, 500-1,000 శాశ్వత ఉద్యోగాలు అంచనా.

టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధి

డాటా సెంటర్లు కేవలం ఉద్యోగాలను మాత్రమే కాక, మొత్తం టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అవి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లను, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీలను, డిజిటల్ మీడియా సంస్థలను ఆకర్షిస్తాయి. ఆ ప్రాంతాన్ని టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నాయి. గూగుల్ వంటి కంపెనీలు స్థానిక సప్లైయర్స్‌, సర్వీస్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నాయి.

AI యుగంలో నైపుణ్యాల అవసరం

AI డాటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుంది. ట్రెడిషనల్ డాటా సెంటర్ నాలెడ్జ్‌తో పాటు, AI స్కిల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారికే అధిక డిమాండ్ ఉంటుంది. మరికొన్ని ఉద్యోగాలకు డిగ్రీ అవసరం లేకుండానే, ఎలక్ట్రికల్ ట్రైనింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, HVAC స్పెషలైజేషన్ వంటి షార్ట్-టర్మ్ సర్టిఫికేషన్స్ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఈ డాటా సెంటర్ టెక్నీషియన్ల వేతనాలు గత మూడేళ్లలో 43% పెరగడం ఈ డిమాండ్‌కు నిదర్శనం.

డాటా సెంటర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. అవి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. పన్ను ఆదాయాలను అందిస్తాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరింత ఊపు తీసుకొస్తాయి. సరైన వ్యూహాత్మక ప్రణాళిక, దీర్ఘకాలిక విజన్ ఉంటే, డాటా సెంటర్లు నిజంగా ఒక ప్రాంతాన్ని ఆర్థికంగా బూస్ట్‌ ఇస్తాయి. అందువల్ల, డేటా సెంటర్‌లను భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి పునాదులుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Frequently Asked Questions

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి?

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల నిర్మాణ దశలో 10,000-15,000 తాత్కాలిక ఉద్యోగాలు, 500-1,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించబడతాయి.

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయి?

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల సంబంధిత ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయి. ఇవి అధిక వేతనాలతో కూడిన నాణ్యమైన ఉద్యోగాలు.

డేటా సెంటర్ల 'మల్టిప్లైయర్ ఎఫెక్ట్' అంటే ఏమిటి?

ఒక డేటా సెంటర్లో ప్రత్యక్షంగా ఏర్పడే ప్రతి ఉద్యోగం, పరోక్షంగా అనేక ఇతర సహాయక పరిశ్రమలలో ఉద్యోగాలను సృష్టిస్తుంది.

డేటా సెంటర్ల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం ఎలా వస్తుంది?

డేటా సెంటర్ల నుంచి వచ్చే ఆస్తి పన్నులు, కంప్యూటర్ ఎక్విప్​మెంట్​పై పన్నులు ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయి.

AI యుగంలో డేటా సెంటర్ల ప్రాముఖ్యత ఏమిటి?

AI యుగంలో డేటా సెంటర్ల డిమాండ్ పెరుగుతుంది. AI, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్​ సెక్యూరిటీ నైపుణ్యాలున్న వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Advertisement

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
Embed widget