Terrorists arrested in Sathya Sai district: సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
Terrorists arrested: సత్యసాయి జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఆయధాలను స్వాధీనం చేసుకున్నారు.

Two Jaish e Mohammed terrorists arrested: సత్యసాయి జిల్లాలో మరోసారి ఉగ్రకలకలం చెలరేగింది. ఇద్దరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్టు చేసిన సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సానుభూతిపరుల నుంచి సింగల్ బ్యారేల్ తుపాకీ , 21 బుల్లెట్లు, పాస్పోర్ట్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఐఎస్ఐ ఉగ్రవాదులతో టచ్ లో ఉంటూ ధర్మవరంలో క్యాంప్
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మొహమ్మద్ ను గత నెలలో అరెస్టు చేశారు. మహమ్మద్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు కీలక సమాచారం లభఇంచింది. నూర్ మహమ్మద్ తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జత్ హుస్సేన్ మహారాష్ట్రకు చెందిన తాపిక్ ఆల్ ఆలమ్ షేక్ మరో ఇద్దరు వ్యక్తుల సైతం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. దీంతో రెండు ప్రత్యేక బృందాల ద్వారా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు.
పాక్ నుంచి ఆదేశాలు తీసుకుని దేశంలో అల్లర్లు సృష్టించే ప్లాన్
విచారణలో వీరు JeMతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు తీసుకుని, భారత్‌లో అల్లర్లు, టెర్రర్ యాక్టివిటీలు ప్లాన్ చేస్తున్నారు. ముస్లిం యువతను రిక్రూట్ చేసి, ఉగ్రవాద శిక్షణకు సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ గ్రూపులు, ఇతర టెర్రర్ గ్రూపుల అడ్మిన్‌లను ట్రేస్ చేస్తున్నారు. ఇటీవల రాయచోటి టౌన్‌లో ఇద్దరు మిలిటెంట్ల అరెస్టు నేపథ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ఆయుధాలు స్వాధఈనం చేసుకున్న పోలీసులు
తమ పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాది సానుభూతిపరులు సజ్జత్ హుస్సేన్ , తాఫిక్ ఆల్ ఆలము షేక్ అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ ప్రకటించారు. వారి వద్ద నుండి సింగల్ బ్యారెల్ తుపాకి తో పాటు, 21 బుల్లెట్లు , పాస్పోర్ట్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తామని , దేశభద్రతకు ముప్పు ముప్పు వాటిల్లకుండా అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. నిషేధిత సోషల్ మీడియా గ్రూపులో పాకిస్థాన్ ఐఎస్ఐ జిహాదీ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాకిస్తాన్ ఆధారిత సోషల్ మీడియా గ్రూప్ పై గట్టి నిఘా ఉంచామన్నారు . ప్రధానంగా ముస్లిం యువత మత విద్వేష విషయాలపై వచ్చే సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు . సందేహాస్పద కార్యకలాపాలు ఆన్‌లైన్ కంటెంట్ దేశ వ్యతిరేక భావాలు, రాడికల్ భావాలను ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు .





















