IPL 2025: అహ్మదాబాద్‌లో సూరీడు ఉగ్రరూపం- అల్లాడిపోయిన ఆటగాళ్లు
IPL 2025: అహ్మదాబాద్‌లో ఢిల్లీ, గుజరాత్ మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో చాలా మంది ఆటగాళ్లు ఎండ దెబ్బకు తాళలేక ఇబ్బంది పడ్డారు.

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో వేడికి ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ సహా పలువురు ఆటగాళ్లు ఎండ దెబ్బతు తాళలేకపోయినట్టు కనిపించారు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటంతో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయి తలపై గుడ్డ వేసుకొని కూర్చొన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకున్నాడు.
Ishant Sharma after see Stubbs and Axar batting 😭😭#GTvsDC pic.twitter.com/dM08tlyo00
— VIKAS (@VikasYadav69014) April 19, 2025
ఐపీఎల్‌లో భాగంగా జరుగుతున్న 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడింది అందులో నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లకు గాను ఐదింట్లో గెలిచింది. పది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్స్‌లో అభిషేక్ పొరెల్ 18, కరుణ్ నాయర్ 31, కేఎల్ రాహుల్ 28, అక్షర్ పటేల్ 39, టెస్టన్ స్టబ్స్ 31, అశుతోష్ శర్మ 37 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ క్రిష్ణ నాలుగు వికెట్లు తీశాడు.
టాస్ గెలిచినప్పుడు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ... "మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఇక్కడ చాలా వేడిగా ఉంది. వికెట్ కూడా చాలా బాగుంది. మేము గతం గురించి పెద్దగా ఆలోచించం. మళ్లీ పుంజుకోవడంపై దృష్టి పెట్టాం. గతంలో ఆడిన జట్టుతోనే వెళ్తున్నాం. రబాడా 10 రోజుల్లో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం.
DC కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ... మేం కూడా ముందు ఫీల్డింగ్ చేయాలనుకున్నాను. వాతావరణం వేడిగా ఉండటంతో అయోమయంలో పడ్డాం. వాతావరణం కారణంగా నేను కొంచెం సందేహాస్పదంగా ఉన్నాం. బౌలర్లు అలసిపోవచ్చు. మేం బాగా స్కోర్ చేయాలని, డిఫెండ్ చేయాలని చూస్తాం. మేము మంచి ఆరంభాన్ని కోరుకుంటున్నాం. మేం మా వ్యూహాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్ కూల్‌గా ఉంది."




















