Kushboo Twitter Hacked: ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... యూజ్ లేదంటూ మెసేజ్ చేసి చివరకు అలా
Kushboo X Account Hacked: సీనియర్ హీరోయిన్, బీజేపీ లీడర్ ఖుష్బూ ఎక్స్(ట్విట్టర్) ఖాతాను యూకేకి చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారు. మీ అకౌంట్ వల్ల యూజ్ లేదంటూ చివరకు క్రిప్టో కరెన్సీ పోస్టులు చేస్తున్నారు.

సీనియర్ హీరోయిన్, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ (Kushboo) ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేశారు. దాంతో ఆ అకౌంటులో వచ్చే పోస్టులను పట్టించుకోవద్దని ఆవిడ తెలిపారు.
Kushboo X - Twitter Account Hacked News: ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో మరొక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ విషయాన్ని ఖుష్బూ తెలియజేశారు. ఆవిడ షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ ప్రకారం యూకేకి చెందిన వ్యక్తులు ట్విట్టర్ హ్యాక్ చేసినట్టు అర్థం అవుతోంది. శనివారం ఉదయం నుంచి తన ట్విట్టర్ గురించి ఎప్పటికప్పుడు ఆవిడ పోస్టులు చేస్తున్నారు.
Also Read: పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి... చంద్రబాబు, పవన్ మీద కామెంట్స్ కేసులో నోటీసులు... బిగుస్తున్న ఉచ్చు?
వాట్సాప్ ద్వారా ఖుష్బూకు హ్యాకర్లు మెసేజ్ చేశారు. హ్యాక్ చేసింది తామేనని అయితే ఆ అకౌంటు వల్ల ఉపయోగం ఏమీ లేదంటూ పేర్కొన్నారు. ఆ తరువాత క్రిప్టో కరెన్సీ పోస్టులు చేయడానికి ఖుష్బూ అకౌంటును వాడారు. క్రిప్టో కరెన్సీకి తాను సపోర్ట్ చేయనని కుష్బూ తెలిపారు. అయితే ప్రస్తుతానికి తన ట్విట్టర్ అకౌంట్ తన చేతుల్లో లేదు గనుక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. సైబర్ పోలీసులకు ట్విట్టర్ హ్యాక్ గురించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Also Read: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram





















