GT vs DC Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP Desam
పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు, పాయింట్స్ టేబుల్ లో టాప్ స్థానం సాధించాలన్న కసితో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో విజయం గుజరాత్ నే వరించింది. రెండు జట్లు సమ ఉజ్జీల్లా తలపడిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఆరంభం బాగుంది కానీ..
టాస్ గెలిచి ఢిల్లీనే బ్యాటింగ్ కు ఆహ్వానించింది గుజరాత్ టైటాన్స్. అదేంటో తెలియదు కానీ ఢిల్లీ బాగా ఆడింది. కానీ స్కోరు బోర్డు మీద చూస్తే ఒక్కరు కూడా కనీసం 40 పరుగులు చేయలేదు. ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ బౌండరీలతోనే గుజరాత్ బౌలర్లకు స్వాగతం పలికారు. అభిషేక్ పోరల్ 9 బంతుల్లోనే మూడు ఫోర్లు ఓ సిక్సు బాది 18 పరుగులు చేసి అవుటైపోయాడు. మరో ఓపెనర్ కరుణ్ నాయర్ 18 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు బాది 31 పరుగులు చేసినా ప్రసిద్ధ్ కృష్ణకు దొరికిపోయాడు. రాహుల్ కూడా అంతే 14 బంతుల్లోనే 4 ఫోర్లు ఓ సిక్సర్ తో 28 పరుగులు చేసినా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ LBW గా వెనుదిరిగాడు. అందరూ మంచి టచ్ లోనే కనపించినా బ్యాట్ నే బాగానే ఝళిపించినా పవర్ ప్లే పూర్తయ్యేలోపే పోరల్, రాహుల్ ఇద్దరూ అవుటైపోయారు.
2. మిడిల్ పరిస్థితి అంతే..
పోనీ మిడిల్ ఆర్డర్ లో ఎవరైనా దుమ్ము దులిపారంటే..ఎస్ అని చెప్పాలి లేదు అని కూడా చెప్పాలి. కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులు చేశాడు. ఓ ఫోర్ రెండు సిక్సులు బాదాడు. తనే ఢిల్లీకి టాప్ స్కోరర్ కానీ దానికి 32బాల్స్ తిన్నాడు అక్షర్ పటేల్. 21 బంతుల్లోనే రెండు ఫోర్లు ఓ సిక్సు కొట్టి 31పరుగులు చేసి స్టబ్స్ కూడా అంతే...చాలా ఇబ్బంది పడ్డాడు స్టార్టింగ్ లోనే చివర్లో గేర్లు మార్చేప్పటికి అవుటైపోయాడు. అశుతోష్ శర్మ డిఫరెంట్ ఫస్ట్ అంతా విరుచుకుపడ్డాడు చివరికి వచ్చే సరికి సైలెంట్ అయిపోయాడు. కానీ 19 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ఢిల్లీ బ్యాటర్లు తమకు అందిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. అలాగే గేర్లు మార్చే టైమ్ కి అవసర షాట్స్ కి వెళ్లి అవుటైపోయారు. కానీ బాదుతూనే ఉండటంతో రన్ రేట్ మాత్రం పదికి ఎప్పుడూ తగ్గలేదు. మే బీ ఇదేమన్నా స్ట్రాటజీనేమో.
3. ప్రసిద్ధ్ కృష్ణ పవర్
ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఏ వ్యూహంతో వచ్చిందో తెలియదు కానీ విరుచుకపడటానికి ట్రై చేసిన ప్రతీ ఢిల్లీ బ్యాటర్ నుూ పెవిలియన్ కు పంపించాడు గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. కాలికి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నా బౌలింగ్ కంటిన్యూ చేసిన ప్రసిద్ధ్ 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నా సరే...4 కీలక వికెట్లు తీసి ఢిల్లీ మరింత స్కోరు కొట్టకుండా ఆపగలిగాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, టాప్ స్కోరర్ అక్షర్ పటేల్, ఆల్ రౌండర్ విప్రాజ్ నిగమ్ లను అవుట్ చేసిన ప్రసిద్ధ్ ఢిల్లీని 203 పరుగులకే పరిమితమయ్యేలా చేశాడు.
4. సాయి షో
ఈ సీజన్ లో నిలకడకు మారుపేరులా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ మరో సారి మంచి ఆరంభాన్నే జీటీకి అందించాడు. 204 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జీటీ...రెండో ఓవర్ లోనే కెప్టెన్ గిల్ వికెట్ను కోల్పోయినా బట్లర్ తో కలిసి పవర్ ప్లేలో రఫ్పాడించాడు సాయి సుదర్శన్. స్టార్క్ లాంటి బౌలర్ నూ కాన్ఫిడెన్స్ కోల్పోయేలా కొట్టిన సాయి చివర్లో పరుగులు రాబట్టటానికి కాస్త తడబడినా 21 బాల్స్ లో 5 ఫోర్లు ఓ సిక్సర్ తో 36పరుగులు చేశాడు. బట్లర్ తో కలిసి హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ తో జీటీని నిలబెట్టాడు.
5. బటర్ పూసి బాదిన బట్లర్
కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ అయిపోయినా బట్లర్ మాత్రం ఎక్కడా ఆగలేదు. షెర్ఫేన్ రూథర్ పోర్డ్ తో కలిసి ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మధ్యలో కాలు పట్టేసినా కాలు కదపకుండా బౌండరీలతో మాట్లాడాడు. 54బంతుల్లో 11ఫోర్లు 4సిక్సర్లతో 97పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు జస్ట్ లో సెంచరీ మిస్సయ్యాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ ను వరుసగా ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు బాది తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బట్లర్..స్టార్క్ కు పరుగుల వరదను గిఫ్ట్ గా ఇచ్చాడు. రూథర్ ఫోర్డ్ కూడా అద్భుతంగా సహకరించాడు బట్లర్ కి. 34 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేసిన రూథర్ ఫోర్డ్ హాఫ్ సెంచరీ మిస్ కాగా..చివర్లో వచ్చిన తెవాటియా వరుసగా స్టార్క్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ కొట్టి...7వికెట్ల తేడాతో గుజరాత్ ను గెలిపించటంతో పాటు ఢిల్లీ కథ ముగించేశాడు. గుజరాత్ బ్యాటర్ల ధాటికి స్టార్క్ కేవలం 20 బంతులకే 49 పరుగులు సమర్పించుకోవటంతో పాటు ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్ లోటాప్ ప్లేస్ కి చేరుకోగా...ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానానికి దిగింది.





















