Kawasaki New Bike: ఇండియన్ రోడ్లపై కవాసకి కొత్త బైక్ - క్లాసిక్ లుక్‌తో మతిపోగొట్టే ఫీచర్లు - ధర ఎంతంటే?
Eliminator Cruiser 500 New Version: కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ 500 బైక్ అప్‌డేట్ వెర్షన్‌తో భారతీయ రోడ్ల మీదకు వచ్చింది. సూపర్ బైక్ పవర్‌ను ఆస్వాదించేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

Kawasaki Eliminator Cruiser 500 Bike Updated Version Launched: కవాసకి, తన పాపులర్ మోడల్ ఎలిమినేటర్ క్రూయిజర్ 500 బైక్‌ను అప్‌డేట్ చేసి భారత మార్కెట్లో కొత్తగా విడుదల చేసింది. ఈ కంపెనీ, అప్‌డేషన్స్ తర్వాత ఈ న్యూ మోడల్ బైక్ (2025 Kawasaki Eliminator Cruiser 500) ధరను రూ. 14,000 పెంచింది. ఈ పవర్‌ఫుల్ బైక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ గురించి తెలుసుకుంటే మతి పోతుంది.
2025 కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ 500 డిజైన్ ఎలా ఉంది?
అప్‌డేటెడ్ వెర్షన్‌లో పూర్తిగా LED లైటింగ్, సొగసైన టర్న్ ఇండికేటర్లు, విశాలమైన హ్యాండిల్ బార్స్, 2-ఇన్-1 ఎగ్జాస్ట్ &స్ల్పిట్ సీటింగ్ ఉంది. అయితే, దీనిలో కలర్ ఆప్షన్ లేవు, ఈ కవాసకి కొత్త బైక్ ఒకే ఒక రంగు ఎంపికలో లభిస్తుంది, అది ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ (Metallic Flat Spark Black) కలర్. దీని థీమ్ పూర్తిగా నలుపు. దీనివల్ల ఈ బైక్ క్లాసిక్ డిజైన్‌లో కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే కలర్ ఆప్షన్‌తో కనిపిస్తోంది. ఎగ్జాస్ట్ పైపుల మీద బర్నిష్డ్ కాపర్ కలర్, ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మీద మెటాలిక్ సిల్వర్ ఫినిషింగ్ మాత్రమే దీనిలో గుర్తించదగిన మరొక షేడ్.
2025 ఎలిమినేటర్ క్రూయిజర్ 500 ఇంజిన్ పవర్
కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ 500లో 451 cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను పవర్ ట్రెయిన్‌గా ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 45 bhp పవర్‌ను & 42.6 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ పవర్ ట్రెయిన్‌ను 6-స్పీడ్, రిటర్న్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో జత కలిపారు. కవాసకి అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని కూడా కొత్త బైక్‌లో యాడ్ చేశారు.
ఎలిమినేటర్ క్రూయిజర్ 500 బైక్ డిజైనింగ్‌లో హై-టెన్సైల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. బండి ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు & వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇవి కుదుపులు లేని & సౌకర్యవంతమైన ప్రయాణానికి భరోసా ఇస్తాయి. ఎలిమినేటర్ 500తో లాంగ్ రైడ్‌లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే, ఈ బైక్‌లో సహజమైన, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ ఉంటుంది & సౌకర్యవంతమైన, ఎర్గోనామిక్ పొజిషన్‌లో కూర్చోగల ఫుట్ పెగ్‌లు కూడా ఉన్నాయి. 735 mm సీటు ఎత్తుతో, వివిధ పొడవుల్లో ఉన్న రైడర్లు ఈ బైక్‌ను నమ్మకంగా నడపగలరు. తక్కువ సీటు ఎత్తు కారణంగా నగర వీధుల్లో, హైవేలో రెండింటిలోనూ ఈ బండిపై రైడర్‌కు సరైన నియంత్రణ ఉంటుంది. దీనివల్ల రైడర్ విశ్వాసం పెరుగుతుంది & ఒత్తిడి లేని రైడింగ్ వీలవుతుంది.
కవాసకి ఎలిమినేటర్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్, మోడర్న్ టెక్నాలజీ & రెట్రో లుక్‌ల కలయికతో వచ్చిన బెస్ట్ ఆప్షన్ అని ఆటో ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
2025 ఎలిమినేటర్ క్రూయిజర్ 500 ఇతర ఫీచర్లు
ఈ కవాసకి బైక్ ముందు & వెనుక చక్రాలు 18 అంగుళాలు & 16 అంగుళాలు. బైక్‌ను పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో డిజైన్ చేశారు. దీనిలో బార్ స్టైల్ టాకోమీటర్ & గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏర్పాటు చేశారు.
2025 కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ 500 ధర
కవాసకి బైక్ అప్‌డేటెడ్ మోడల్ రూ. 5 లక్షల 76 వేల ఎక్స్ షోరూమ్ ధర (2025 Kawasaki Eliminator 500 Launch Price Rs 5.76 Lakh)తో లాంచ్ అయింది.





















