Roja: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
Janasena: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రోజాపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Jana Sena expresses anger On Roja: వైసీపీ నేత రోజాపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో తన ఇంటి వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న సమయంలో ఆమె పక్కనే కూర్చుని మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని, వారి అబ్బాయిని మార్క్ శంకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ తల్లిగా ఆమె అలా మాట్లాడకూడనదన్న విమర్శలు వచ్చాయి. జనసేన నేతలు ఇప్పుడు ఆమె తీరును నిరసిస్తూ పలు చోట్ల ఆందోళనలుచేస్తున్నారు.
రోజా దిష్టి బొమ్మ కి చొప్పుల మాల వేసి, ప్యాకేజ్ అన్నందుకు రోజా దిష్టి బొమ్మ ని చొప్పు తో కొట్టి, దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజా కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. రోజా కి నగిరి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ది రాలేదని, నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే వాగడం సరికాదని హెచ్చరించారు. రోజాని ప్రజలు మరిచిపోయారని, ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఇలాంటి చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తుందనిక జనసేన నేతలు అంటున్నారు. ఎంత ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నావని ఎగ్దేవా చేశారు. ఇప్పటికీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నానని, మరొక్క సారి పవన్ కళ్యాణ్ పైన నిరాధార ఆరోపణలు చేసి, చిల్లర గా మాట్లాడితే నగిరి లో రోజా ఇంటి ని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా దిష్టి బొమ్మ కి చొప్పుల మాల వేసి, దిష్టి బొమ్మ దగ్ధం చేసిన శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా.
— Vinutha Kotaa (@VinuthaKotaa) April 19, 2025
మొన్న తిరుపతిలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, వారి అబ్బాయిని ఉద్దేశించి… pic.twitter.com/XdUcNbiOhy
రోజా ఇప్పటికే అసభ్యంగా మాట్లాడే రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. రాజకీయంగా నేతల్నిఎన్ని తిట్లు తిట్టినా రోజా కుటుంబసభ్యుల జోలికి రాకుండా ఉండాల్సిందని జనసేన నేతలు అంటున్నరాు. తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి వచ్చి ఇప్పుడు ఆయన సోదరుడి పిల్లలకు చెడు జరగాలని కోరుకుంటున్నారని మండి పడుతున్నారు. ఇలాంటి రాజకీయ నేతల్ని ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.
రోజా...జాతుల్లో మూడు జాతులు Male,Female,Transgender...రోజా నాలుగో రకం 😂😂.
— Team PoliticalSena (@Teampolsena) April 18, 2025
గతంలో సినిమా టిక్కెట్లు,తిరుపతి దేవస్థానంలో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న చరిత్ర@RojaSelvamaniRK గారిది
~@bolisetti_satya 💥💥👌@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/VdvZAXcsLO





















