IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
LSG Win: లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి విజయాల బాట పట్టింది. రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. దీంతో టోర్నీలో ఐదో విక్టరీని సొంతం చేసుకుంది. పట్టికలో టాప్-4కి చేరుకుంది.

IPL 2025 RR 3rd Victory: లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. శనివారం జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్.. రాజస్థాన్ రాయల్స్ పై 2 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి దశలో రాయల్స్ ను కట్టడి చేసి, విక్టరీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టన్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వనిందు హసరంగా రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రేమే చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. చివరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి, 9 పరుగుల టార్గెట్ ను కాపాడుకున్నాడు. కేవలం6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లీగ్ లో టాప్-4తో లక్నో నిలిచింది.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
ఆకట్టుకున్న మార్క్రమ్..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న మిషెల్ మార్ష్ (4) త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (11), కెప్టెన్ రిషభ్ పంత్ విఫలమైనా.. ఒక ఎండ్ లో మార్క్రమ్ నిలబడ్డాడు. ఆయుష్ బదోనీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక వైపు యాంకర్ ఇన్నింగ్స్ తో మార్క్రమ్ నిలబడగా, బదోని కాస్త వేగంగా ఆడాడు. ఈ దశలో ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. నాలుగో వికెట్ కు 76 పరుగులు జత చేసింది. ఈ నేపథ్యంలో మార్క్రమ్ 31 బంతుల్లో, బదోని 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో10 బంతుల తేడాతో మార్క్రమ్, బదోని ఔటయ్యారు. అయితే చివర్లో అబ్దుల్ సమద్ నాలుగు సిక్సర్లతో చెలరేగడంతో ఆఖరుకు 180 పరుగుల మార్కును దాటింది.
Absolutely 🔥 🔥 🔥
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Avesh Khan delivered a yorker masterclass when it mattered most, and just like that, #LSG pull off a 2-run thriller!
How do you even rate that spell of magic?! 🔥
Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/1UKViGuhUl
సూపర్ భాగస్వామ్యం..
ఇక కాస్త భారీ టార్గెట్ ఛేజింగ్ లో రాజస్తాన్ కు చక్కని ఆరంభం దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా 14 ఏళ్ల 23 రోజుల వ్యవధిలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. దీంతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడైన ప్లేయర్ గా నిలిచాడు. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. సూర్యవంశీ కూడా చక్కిని ఇన్నింగ్స్ ఆడాడు. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నా, ఎలాంటి తడబాటు లేకుండా, 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి సత్తా చాటి, ఓవరాల్ గా 34 పరుగులు చేసి, రాణించాడు. ఈ క్రమంలో 52 బతుల్లోనే 89 పరుగుల తొలి వికెట్ కు భాగస్వామాన్ని నెలకొల్పారు. సూర్యవంశీ ఔటైన తర్వాత 31 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (39) తో కలిసి జైస్వాల్ దాదాపు జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నించాడు. అయితే కీలకదశలో వీరిద్దరూ ఔట్ కావడం, చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక, బ్యాటర్లు తేలిపోవడంతో రాయల్స్ చతికిల పడింది. దీంతో మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.




















