అన్వేషించండి

Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్

Hydra: జూబ్లిహిల్స్‌లో నార్నేకు చెందిన భూముల్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కబ్జా చేస్తున్నారని ఓ బాలుడు లేఖ రాయడంతో హైడ్రా స్పందించింది.

Hydra seizes Narne lands in Jubilee Hills:  జూబ్లీహిల్స్‌లోని రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని  బాలుడి లేఖ ద్వారా హైడ్రా కబ్జా కాకుండా కాపాడిది.  హైదరాబాద్ లో HYDRAA నిర్వహించిన  ఆపరేషన్‌లో లాంగర్ హౌజ్‌కు చెందిన ఒక బాలుడు విజిల్‌బ్లోయర్‌గా మారాడు. ఆ బాలుడు రాసిన లేఖ వల్ల జూబ్లీహిల్స్‌లోని 39 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమిని  తిరిగి పొందేందుకు కారణం అయింది.  దీని విలువ రూ.3,900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

రోజూ క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్ లో కంచె

హైడ్రాకు లేఖ రాసిన బాలుడు JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు.  హైడ్రా  కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు.  HYDRAA ఆ స్థలాన్ని పరిశీలించి, భూమిని విక్రయించడానికి,  అభివృద్ధి చేయడానికి జరిగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని కూల్చివేసింది.  

పిల్లవాడి లేఖతో  కదిలిన హైడ్రా 

నిషేధ జాబితాలో ఉన్న భూమిని నార్నే ఎస్టేట్స్ నిశ్శబ్దంగా అమ్మేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చట్టపరమైన వివాదం సమయంలో ఏదైనా అభివృద్ధి లేదా అమ్మకం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జోన్‌లలో ఒకటైన 39 ఎకరాల విస్తీర్ణంలో, ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా మార్కెట్ రేటును ఉంటుంది.  ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. 

అక్కడ బోర్డులు ఉన్నా సరే అమ్మేస్తున్న నార్నే గ్రూపు                

 ల్యాండ్ గ్రాబింగ్ కేసున్న‌ట్టు అక్క‌డ బోర్డులుంటుండ‌గానే.. మ‌రోవైపు అక్క‌డ ప్లాట్ల కొనుగోలుకు సంప్ర‌దించాల్సిన ఫోను నంబ‌ర్ల‌తో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ‌.   అనుమతిలేని లే ఔట్‌తో ర‌హ‌దారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హాఫీజ్‌పేట్‌, రాయ‌దుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు.     

కబ్జా దారులపైకేసులు పెట్టిన హైడ్రా                 

నార్నె ఎస్టేట్స్ కు యజమాని నార్నే శ్రీనివాసరావు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతీ తండ్రి. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థనే భూముల్ని కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది. రాయదుర్గం ఎరియాలో నార్నే పేరుతో ఓ రోడ్ ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఆ భూములు కబ్జాలని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై నార్నే గ్రూపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Petrol Diesel Price Down India: లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Prakash Raj: ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం.. ఛాన్స్ ఉందా
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్.. ఛాన్స్ ఉందా
Embed widget