అన్వేషించండి

Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్

Kancha Gachibowli Lands | కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తనకు వచ్చిన నోటీసులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఘాటుగా స్పందించారు. అధికారులనే కొన్ని డౌట్లు అడిగారు.

HCU Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇదివరకే రాష్ట్రం నుంచి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు విషయం వెళ్లగా ఆ భూములలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ భూములకు సంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆమె.. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చానంటూనే ఓ కీలక సందేహాన్ని లేవనెత్తారు. ఇది మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. 

పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ విషయంపై క్లారిటీ అడిగారు. తాను షేర్ చేసిన పోస్టుకుగానూ నోటీసులు ఇచ్చారు ఓకే. అయితే తాను షేర్ చేసిన పోస్టును సోషల్ మీడియాలో 2 వేల మంది వరకు రీషేర్ చేశారు. వారందరిపై సైతం ఇదే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్మితా సబర్వాల్ సూటిగా అడిగారు. ఒకవేళ వారిపై అలాంటి చర్యలు లేవంటే.. తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరూ అతీతులు కాదనేది ఇక్కడ వర్తించడం లేదని స్పష్టమవుతోందని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 

ఓ ట్విట్టర్ హ్యాండిల్ ఫోటో రీపోస్ట్ 
 
మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫోటోను సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ రీపోస్టు చేశారు.  UoH లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు ఒక నెమలి ,  ఒక జింక గిబ్లి శైలిలో బుల్డోజర్‌లను చూస్తున్నట్లు అందులో ఉంది. స్మితా సబర్వాల్ షేర్ చేసిన పోస్టు సోసల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు రెండు వేల మంది తాను షేర్ చేసిన పోస్టుపై స్పందించారని స్మితా సబర్వాల్ అంటున్నారు. మరోవైపు పోలీసులు ఇచ్చిన నోటీసులోని విషయాలను వెల్లడించడం లేదు. అయితే 400 ఎకరాల భూముల విధ్వంసంపై AI-జనరేటెడ్ ఫొటో షేర్ చేయడం  గురించి BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసు ఇచ్చామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. అయితే ఏఐ జనేటెడ్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 

దాంతో అధికారులు ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ తో పాటు అలా పోస్టులు షేర్ చేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget