అన్వేషించండి

Chandra Babu Naidu Birth Day: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎన్ని? రిచెస్ట్‌ సీఎం ఎలా అయ్యారు?

Chandra Babu Naidu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు గురించి నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు. :

What Is The Net Worth Of Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో రెండు రోజుల్లో 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజును టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఆయన మాత్రం ఈ పుట్టిన రోజును ఎలాంటి హడావుడి లేకుండా ప్రైవేటుగా జరుపుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు.  

చంద్రబాబు ఆస్తులు ఎంత ?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులు ఎంత ఉంటాయనే ఆసక్తి నెటిజన్లలో కనిపిస్తోంది. ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వెతుకుతున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో తన ఆస్తులకు సంబంధించిన వివరాలు అందజేశారు. 2024 ఏప్రిల్‌లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు కుటుంబానికి 931.83 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 

చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన పేరు మీద కేవలం 4.80 లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయి. అంటే ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్‌లతోపాటు 1994 కొనుగోలు చేసిన 2.25 లక్షల విలువైన అంబాసిడర్ కారు చూపించారు. ఆయన పేరు మీద 36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో కుప్పలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, హైదరాబాద్‌లో ఉన్న ఇల్లును చూపించారు. కుప్పంలో కట్టిస్తున్న ఇంటి విలువ 77.33 లక్షలుగా తెలియజేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటి విలువ 70.20 కోట్ల ఉంటుందని వెలకట్టారు. 

ఇవి కాకుండా వారసత్వంగా వచ్చిన ఆస్తులు లెక్కలు కూడా అఫిడవిట్‌లో చేర్చారు. ఆయనకు 43.66 లక్షల రూపాయల విలువైన ఆస్తి వారసత్వంగా వచ్చినట్టు వెల్లడించారు. ఇప్పుడు అమరావతిలో కడుతున్న ఇంటి లెక్కలు యాడ్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ సమర్పించేనాటికి ఇంకా అక్కడ భూమి కొనుగోలు చేయలేదు. అందుకే ఇప్పటికి ఇది అదనంగానే చెప్పాలి. ఆయనకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఏడీఆర్ ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. దీనికి ఆయన భార్య పేరు మీద ఉన్న ఆస్తులే కారణం. 

భార్య భువనేశ్వరి ఆస్తులు ఎంత ఉన్నాయి?
చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల్లో భార్య భువనేశ్వరి వాటానే ఎక్కువగా ఉంది. ఆమె పేరు మీద ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్ లిమిటెడ్‌ను 1992లో స్థాపించారు. ఇందులో ఆమెకు 24.37 శాతం వాటా ఉంది. మొన్న జనవరి నాటికి ఆమె వాటా విలువ 763కోట్లుగా ఉంది. దీంతోపాటు ఆమె పేరు మీద హైదరాబాద్‌లోని మదీనాగూడలో 55 కోట్లకుపైగా విలువైన ఐదు ఎకరాల భూమి ఉంది. చెన్నైలోని శ్రీపెంరబుదూర్‌లో ఓ కమర్షియల్ కాంప్లెక్ ఉంది. దాని విలువ 30 కోట్లకుపైగానే ఉంటుంది. 

2019లో చంద్రబాబు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం వ్యక్తిగత ఆస్తుల విలువ 3.87 కోట్లు ఉంటే కుటుంబ ఆస్తులు 668.57 కోట్లు. ఐదేళ్లలో 39 శాతం పెరిగిందని అర్థమవుతుంది. ఇవి కాకుండా కుమారుడు లోకేష్‌ కోడలు బ్రాహ్మణి ఆస్తులు వేరుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను నారా లోకేష్ తన ఎన్నికల అఫిడవిడ్‌లో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికి అఫిడవిట్‌ల ద్వారా ఆస్తులు సమర్పించాలనే రూల్ లేదు. అందుకే చంద్రబాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన 1978 సమాచారం కానీ, తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1995 సంవత్సర సమాచారం కానీ అందుబాటులో లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget