Vijayashanti: 'కొన్ని దుష్టశక్తులు సినిమాను నాశనం చేస్తున్నాయి' - ఇది పద్ధతి కాదంటూ రివ్యూయర్స్‌కు విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్
Arjun Son Of Vyjayanthi: సినిమా బాగున్నా కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నటి విజయశాంతి మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదంటూ ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Vijayashanti Strong Warning To Movie Reviewers: కొన్ని దుష్టశక్తులు సినిమాను నాశనం చేయడానికి చూస్తాయని.. ఇది మంచి పద్ధతి కాదంటూ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) అన్నారు. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun Son Of Vyjayanthi) మూవీ సక్సెస్ మీట్‌లో ఆమె తాజాగా మాట్లాడారు. ఈ సందర్భంగా రివ్యూలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అది వాళ్ల శాడిజం'
'కొంతమంది సినిమాను డిస్ట్రబ్ చేయడానికి ఉంటారు. అది వాళ్ల సంస్కారం. దాన్ని శాడిజం అంటారో ఇంకేం అంటారో కూడా చెప్పలేం. ఏ సినిమానైనా నిర్మాతలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో శ్రమిస్తే ఓ సినిమా రూపొందుతుంది. అలాంటి సినిమాపై తప్పుగా నెగిటివ్ రాతలు రాస్తే అది తప్పు. కొంతమంది కావాలనే ఇది చేస్తున్నారు. ఏ సినిమా అయినా నెగిటివ్ మాట్లాడడం, రాయడం మంచి పద్ధతి కాదు. బాగున్న సినిమాను బాగా లేదని.. బాగా లేని సినిమాను బాగుందని చెప్పడం సరి కాదు. ఏ సినిమా అయినా మంచిగా ఆడాలి.' అని విజయశాంతి అన్నారు.
Also Read: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ
'వాళ్లు మైండ్ సెట్ మార్చుకోవాలి'
సినిమాల గురించి నెగిటివ్ రివ్యూలు రాసే వారు వాళ్ల మైండ్ సెట్ మార్చుకోవాలని విజయశాంతి అన్నారు. 'ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా.. చిన్న సినిమా అయినా ఏదైనా ఎన్నో హోప్స్‌తో ఇండస్ట్రీకి వస్తారు. వాళ్లను ఆశీర్వదించండి. మీకు నచ్చకుంటే చూడొద్దు. సైలంట్‌గా ఉండండి. సినిమాను ఖూనీ చేద్దామని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాళ్లకు నేను వార్నింగ్ ఇస్తున్నా. దయచేసి ఇక ఆపండి. ఏ రూపంలోనైనా మీరు వచ్చి డిస్ట్రబ్ చేస్తున్నారు.
ప్రజలు పాజిటివ్‌గా చెప్తుండేటప్పుడు మీరు పైశాచికానందం తీసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటే వాళ్లకు భజన చేయండి. అంతే తప్ప సినిమాను నాశనం చేసేలా రాతలు రాయొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటి జనరేషన్ ఎన్నో హోప్స్‌తో ఇండస్ట్రీకి వస్తారు. అలాంటి వాళ్ల సినిమాను నాశనం చేద్దామని అనుకుంటే మిమ్మల్ని మాత్రం క్షమించకూడదు. అందుకే దయచేసి కంట్రోల్‌గా ఉండండి.' అంటూ విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
'ఇంకో హీరో ఇలాంటి క్లైమాక్స్ ఒప్పుకోరు'
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని.. ఇంకో హీరో ఎవరైనా సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ ఒప్పకోరని విజయశాంతి అన్నారు. 'క్లైమాక్స్‌లో ఇలాంటిది చేయడం రిస్క్ అని చాలా సందేహాలు ఉంటాయి. హీరోలు ఎవరైనా తమ ఇమేజ్, ఫ్యాన్స్ ఏమనకుంటారో అని ఆలోచిస్తారు. కానీ ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రిస్క్ తీసుకుని క్లైమాక్స్‌లో ఓ హైప్ క్రియేట్ చేశారు. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్.' అని అన్నారు.
కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా.. కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు మూవీని నిర్మించారు.





















