TCS WFH Rules: TCS టెక్కీలకు చేదు వార్త!, మారిన 'వర్క్ ఫ్రమ్ హోమ్' రూల్స్
TCS Work From Home Policy: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఉద్యోగుల హాజరు విధానాన్ని మరింత స్ట్రిక్ట్‌గా మారుస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

TCS Has Changed Work From Home Rules: నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS), తాజాగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జాతీయ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, TCS తన ఉద్యోగుల ఇంటి నుంచి పని చేసే విధానం (TCS Work From Home Policy)లో మార్పులు చేసింది. టెక్కీల హాజరులో ఖచ్చితత్వాన్ని తీసుకురావడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. రిపోర్ట్‌ల ప్రకారం, పర్సనల్ ఎమర్జెన్సీ డేస్, ఎంట్రీ డెడ్‌లైన్స్, బ్యాక్-ఎండ్ ప్రాసెస్‌లో సర్దుబాట్లు అవసరం.
వ్యక్తిగత అత్యవసర రోజులు (Personal Emergency Days): ఉద్యోగులు ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం, వీటిని, ప్రతి మూడు నెలలకు (త్రైమాసికానికి) 6 రోజులు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఉపయోగించుకోని వ్యక్తిగత అత్యవసర రోజులు ఉంటే, వాటిని తదుపరి త్రైమాసికానికి ఫార్వార్డ్ చేయవచ్చు.
ఎక్సెప్షనల్ ఎంట్రీ (Exceptional Entry): స్థలం పరిమితుల నేపథ్యంలో, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 రిక్వెస్ట్‌లు సమర్పించవచ్చు. ఏదైనా నెట్‌వర్క్ సంబంధిత సమస్య ఉంటే, ఒకేసారి గరిష్టంగా ఐదు సార్లు లాగిన్ అవ్వవచ్చు. రిక్వెస్ట్‌ను 10 రోజుల లోపు సమర్పించకపోతే, అది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుంది. పాత తేదీ ఉన్న ఎంట్రీల విషయంలో చివరి రెండు పని దినాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మిస్ అయిన ఎంట్రీ కోసం తదుపరి నెల 5ల తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
5 రోజుల హాజరు విధానం (5 Day Attendance Policy): ఇతర ఐటీ కంపెనీల మాదిరిగా కాకుండా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పటికే వారానికి 5 రోజులు హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఐటీ ఇండస్ట్రీలోని ఇతర టెక్ కంపెనీలలో ఇది వారానికి మూడు రోజులుగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: ఈ జంట ఇంట్లో కూర్చొని రూ.50 లక్షలు సంపాదిస్తోంది, ఈ టెక్నిక్ మీరూ ట్రై చేయొచ్చు
ఒత్తిడి లేని పని వాతారణం ఉండాలి
TCS HR హెచ్ మిలింద్ లక్కాడ్ చెప్పిన ప్రకారం, మేనేజ్‌మెంట్ తన ఉద్యోగుల కోసం మంచి పని వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చక్కటి పని వాతావరణంలో ఉద్యోగులు సంతోషంగా & శ్రద్ధగా పని చేస్తారు, ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఇది ఉద్యోగుల మానసిక & శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో, ఉత్పాదకత కూడా పెరుగుతుంది, ఇది కంపెనీకి ప్రయోజనం. అంటే, విన్-విన్ విధానం అన్నమాట.
మరో ఆసక్తికర కథనం: సింగిల్ ప్రీమియంతో జీవితాంతం పింఛను - ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

