Tirupati Special Herbal Soup | తిరుపతిలో ప్రాచుర్యం పొందుతున్న హెర్బల్ సూప్ కార్నర్ | ABP Desam
మందారం, కరివేపాకు, పొనగంటి, బ్రహ్మి, కొండవుచింత, అడ్డసరము, పిన్న ములక, వేపాకు, నేల ఉసిరి, తులసి ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా...వీటితో కూడా సూప్ చేయొచ్చని దాన్ని ఉదయం, సాయంత్రం తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం..ఆకలికి ఆకలి తీరుతుందని తెలుసా. మా ఇంట్లో పెద్దోళ్లు చాలా సార్లు చెప్పారు. ఆ కషాయాలు ఎవరు తాగుతారు అనేగా..కానీ ఇవి కషాయాల్లా ఉండవు..ట్రెండీ మేకింగ్ తో తయారైన టేస్టీ హెర్బల్ సూప్స్. ఇటీవలి కాలంలో సూప్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మిల్లెట్స్ తో పాటు వెజ్ ఆర్ నాన్ వెజ్ సూప్ తీసుకుంటే డే చాలా ఎనర్జిటిక్ గా స్టార్ట్ అవుతుందని చాలా మంది ఫీలవుతున్నారు. అలాంటి వాళ్లకు హెల్తీ హెర్బల్ ఐటమ్స్ తో సూప్స్ చేసి అమ్ముతున్నారు తిరుపతిలో. మొత్తం 30 రకాల ఆకులు, ఔషధమొక్కలతో సూప్స్ చేసి అమ్ముతున్నారు. కేవలం ఇరవై రూపాయలే ధర పెట్టడంతో రోజుకు 80 నుంచి 100 మంది తాగుతారని నిర్వాహకులు చెబుతుంటే..నగరంలో ఇలాంటి సూప్ అవుట్ లెట్ ఇదొక్కటే కావటంతో డైలీ ఇక్కడికే వస్తున్నామని టెస్టీగా హెల్తీగా ఉంటోందని తాగినవాళ్లు చెబుతున్నారు.





















