Hyderabad Latest News: లవర్‌తో ఆ స్పాట్‌లో దొరికిన GHMC జాయింట్ కమిషనర్ - చితక్కొట్టిన భార్య, బంధువులు
Hyderabad Latest News: పెళ్లైన ఓ ప్రభుత్వ ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన భార్య స్పాట్‌కు వచ్చి అతన్ని చితకబాదింది. GHMC పరిధిలో జరిగిన ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

Hyderabad Latest Crime News: GHMC జాయింట్ కమిషనర్ వివాహేతర సంబంధం బహిర్గతమైంది. ఆయన్ని రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య, ఆమె బంధువులు చితక్కొట్టారు. జానకిరామ్‌తో ఉన్న ఆ మహిళపై కూడా చేయి చేసుకున్నారు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు లాక్కున్నారు.
జానకిరామ్ GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. అతను పెళ్లైనప్పటికీ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో కాపురం కూడా పెట్టినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న భార్య కల్యాణి, ఆమె తరఫు బంధువులు ఆ ఇంటిపై రైడ్ చేశారు.
బంధవులతో కల్యాణి వచ్చిందని తెలుసుకున్న జానకిరామ్ బయటకు వచ్చి మాట్లాడాడు. లోపల ఉన్న మహిళ బయటకు రాకుండా తలుపు వేశాడు. చేస్తున్నది మంచిది కాదని భార్య నిలదీసింది. చెప్పేది వినాలంటూ ఆమెపై జానకిరామ్ కోపంతో మాట్లాడాడు. ఇంతలో కల్యాణితో వచ్చిన వారంతా జానకిరామ్‌పై చేయి చేసుకున్నారు. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ చితక్కొట్టారు.
అమ్మాయితో రాసలీలలు.. అడ్డంగా దొరికిపోయిన "GHMC" అధికారి..!"వారసి గూడ"
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) February 21, 2025
తన కంటే 20 ఏళ్ల చిన్న అమ్మాయి అంట... "వెదవ"
ఆ అమ్మాయికి సిగ్గు ఉండొద్దు పెళ్లయి పిల్లలు ఉన్నా వాడితో 🤮
ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే భార్య అంటుంది నా భర్త కి ఇలాంటివి అలవాటే ప్రతీ దగ్గరే అని
ఎంత విసిగిపోయిందో pic.twitter.com/IwWLDMbrxt
చెప్పేది వినాలి అంటున్నా వినిపించుకోకుండా తీవ్రంగా దాడి చేశారు. ఇంతలో కల్యాణితో వచ్చిన వాళ్లంతా మహిళను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తుంటే వద్దని జానకిరామ్ గట్టిగా అరిచాడు. ఆ పిల్లను ఏం చేయొద్దని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి జానకిరామ్‌పై చేయిచేసుకున్నారు.
భార్య వద్దని చెబుతున్నా వచ్చిన వారు మాత్రం జానకిరామ్ పని పట్టారు. ఇంతలో తలుపును తోసుకుంటూ లోపల ఉన్న మహిళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయినా మహిళలు గట్టిగా నెట్టి ఆమెపై కూడా చేయి చేసుకున్నారు. ఆమె బోరున ఏడుస్తూనే ఉంది. తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ కల్యాణి చెంపపై గట్టిగా కొట్టింది. మెడలో ఉన్న నగలు లాక్కున్నారు. ఇద్దర్నీ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

