Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP Desam
ముంబైలో ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ గాయని సంజీవని భేలాండే ఆలపించిన సరస్వతీ వందనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ సదస్సులో స్వాగత ప్రసంగం చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో చర్చించే అంశాలన ప్రస్తావించారు.
ఆయన పూర్తి ప్రసంగం ఇదే :
"లేడీస్ అండ్ జెంటిల్మెన్,
ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025కి స్వాగతం.
కొత్త అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోట్లాది మంది నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వ్యాధుల తీవ్రతను అంచనా వేయటంలో డేటా మైనింగ్ ఉపయోగపడుతోంది. రెండోసారి అంతరిక్ష పోటీ ప్రారంభమైంది. ఈసారి భారత్ కూడా అందులో ఉంది. మరణమే లేకుండా జీవించటంపై సాధ్యాసాధ్యాలను శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.
మనల్ని ఆపుతోంది ఏంటి.?
మనమే.
మానవ జాతికి AI ముప్పుగా మారుతుందని భావిస్తున్న వాళ్లు ఉన్నారు. సమస్త మానవాళిని AI అంతం చేస్తుందని భయపడుతున్నారు. రాజకీయ నాయకులు, విదేశీ శక్తులు మన డేటాను తీసుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అంతరిక్షంలో జరుగుతున్న సంగతులన్నీ భూమ్మీద మన దేశాల మధ్య రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ వయస్సు మీద పడిన తమ జనాభాను పోషించేందుకు నానా తంటాలు పడుతున్నాయి.
పెద్ద ప్రశ్నలు ఉన్న చోటే కొన్ని సమాధానాలు ఉంటాయి.
ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేలా AI మీద నియంత్రణ ఉండాలి. డేటా మైనింగ్ టూల్స్ వాడటం ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలు గుర్తించగలగాలి. అంతరిక్షంలో ఎంతటి నిబంధనలు పాటిస్తామో అంతటి నిబంధనలు మన భూమి విషయంలోనూ పాటించాలి. దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రజలు తమ పనివేళలను పొడిగించుకోవాలి, కార్యాలయాలు కూడా మరింత సౌకర్యవంతంగా మారాలి. మనకు నాయకత్వం, సహకారం, కొంచెం కామన్ సెన్స్ అవసరం.
మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి.
అదే మనల్ని తర్వాతి దశకు తీసుకువెళ్తుంది.
ధన్యవాదాలు."





















