NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
NTR Neel Movie : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ మొదలైంది. 'డ్రాగన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు విన్పిస్తున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారో తెలుసా ?

NTR Neel Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాన్ ఇండియా రేస్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'దేవర' మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ చర్చకు దారి తీసింది.
'ఎన్టీఆర్ 31' మూవీకి భారీ బడ్జెట్
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన కెరీర్లోనే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. భారీ సినిమాలకు హీరోల నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే అద్భుతమైన ఎలివేషన్స్, ఊహించని రేంజ్లో యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయనతో కలిసి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 250 కోట్ల బడ్జెట్తో నిర్మించిన 'దేవర' మూవీతో ఎన్టీఆర్ సోలో హీరోగా 450 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి బడ్జెట్ మరింతగా పెరగబోతుంది.
ఎన్టీఆర్ - నీల్ కాంబినేషన్లో రాబోతున్న మూవీని ఏకంగా 360 కోట్ల భారీ బడ్జెట్తో సెట్స్ పైకి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇప్పటిదాకా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదే. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై ఎనర్జీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు కోసం పూర్తిగా బల్క్ డేట్స్ కేటాయించబోతున్నట్టు సమాచారం. అలాగే ఇందులో ఎన్టీఆర్ ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్ 31' మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళింది. ఫిబ్రవరి 20 నుంచి ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు. ఎన్టీఆర్ లేకుండానే దాదాపు 1500 నుంచి 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ సీన్ నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ మొదలైంది అన్న విషయాన్ని మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.
ఇక మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, వచ్చే నెల ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఎన్టీఆర్ 31' మూవీ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లడంతో, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Also Read: 'శివంగి'గా ఆనంది ఫస్ట్ లుక్ - లుంగీ కట్టుకుని నుదిటిపై విభూతితో డిఫరెంట్‌గా పవర్ ఫుల్ లేడీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

