అన్వేషించండి

HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 

HYDRA Latest News: హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా చట్టం ప్రకారం నడుచుకోరా ఆని ప్రశ్నించింది.

HYDRA Latest News: తెలంగాణలో హైడ్రా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో కొంత పాజిటివ్‌ ఫలితాలు ఉంటే మరికొంత నెగిటివ్ కాంప్లికేషన్స్‌ కూడా వస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ఇదే విషయంపై హైడ్రాను నిలదీసింది. కొందరు వ్యక్తిగత కక్షతో హైడ్రాను సంప్రదించి తమకు అనుకూలమైన పనులు చేయించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేసింది. 

ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెబతున్నా పట్టించుకోకుండా హైడ్రా ఇష్టానుసారంగా పని చేస్తోందని తెలంగాణ హైకోర్టు మరోసారి ఫైర్ అయింది. ఇకపై జీవో 99కు విరుద్దంగా వెళ్తే మాత్రం హైడ్రాను రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. డాక్యుమెంట్స్ చూసి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆ హక్కు హైడ్రాకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. వివరాలు పరిశీలించకుండా తన షెడ్‌ను కూల్చేశారని ఆయన వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేశారు. ఈ విచారణకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరయ్యారు.   గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదుతోనే హైడ్రా చర్యలు తీసుకుందని బాధితుడు తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నిర్మాణాలకు 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. 

Also Read: తెలంగాణ ఎప్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

బెదిరించి పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతులు తీసుకున్నారని కోర్టుకు హైడ్రా వివరించింది. 2025లో వాటిని రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపారు హైడ్రా న్యాయవాది. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్‌ కేసు’ సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు కూల్చివేయవచ్చని పేర్కొందని గుర్తు చేశారు. 

హైడ్రా న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి సీరియసస్ అయ్యారు. పరిష్కరిస్తున్న కొద్దీ హైడ్రపై పిటిషన్లు వస్తూనే ఉన్నాయని అన్నారు. బెదిరించి అనుమతులు తీసుకున్నట్టు ఎలా చెబుతారని నిలదీశారు. అనుమతులు ఇచ్చిన తర్వాత రద్దు చేసే వరకు రెండేళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన వాళ్లు గతంలో ఎందుకు చేయలేదని అనుమానం వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చే వరకు వాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. 

హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పార్కు స్థలం అని నిర్ణయించాల్సింది ఎవరని, సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన విషయాన్ని మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించింది. అ స్థలంలో నిర్మాణాలు చేపట్టే వ్యక్తిని కబ్జాదారుగా అనడానికి రైట్ ఎక్కడుందన్నారు. ప్రస్తుతానికి ఆ స్థలంలో యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించి కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించింది. కేసు విచారణను మార్చి 5కి వాయిదా వేశారు. 

Also Read: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Jagadish Reddy: పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget