Bhoothaddam Bhaskar Narayana: మరో ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ - మహిళల తలలు నరికేసే సైకో వాటితో ఏం చేస్తాడంటే..?
Bhootaddam Bhaskar Narayana OTT Platform: క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి కోవకు చెందిందే 'భూతద్దం భాస్కర్' మూవీ. 'ఆహా' పాటు 'అమెజాన్ ప్రైమ్'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Bhootaddam Bhaskar Narayana Now Streaming On Amazon Prime Video: క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రాలంటే మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇలాంటి మూవీస్‌కు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మంచి కంటెంట్‌తో థ్రిల్లింగ్‌ను పంచేలా మూవీస్ రూపొందిస్తే ప్రేక్షకులు కచ్చితంగా విజయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం పలు ఓటీటీలు సైతం క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలాంటి థ్రిల్‌ను పంచే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది 'భూతద్దం భాస్కర్ నారాయణ' (Bhootaddam Bhaskar Narayana) మూవీ. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా నటించిన ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. స్నేహల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ మూవీ గతేడాది మార్చి 1న థియేటర్లలోకి విడుదలై ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను పంచింది. అనంతరం 'ఆహా' (Aha) ఓటీటీలో రిలీజై అలరించింది. తాజాగా, 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ (Amazon Prime Video) రిలీజైంది.
'భూతద్దం భాస్కర్ నారాయణ' కథేంటంటే..?
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో వరుసగా అమ్మాయిలు దారుణ హత్యకు గురవుతుంటారు. అమ్మాయిల తలలు నరికేసే సైకో ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఏ ఒక్క క్లూ కూడా దొరక్క పోలీసులు సైతం తలలు పట్టుకుంటారు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలుగా పేర్కొంటారు. ఈ క్రమంలోనే లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో హీరోయిన్ అక్క సైతం హత్యకు గురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న భాస్కర్ ఎలా పరిష్కరించాడు.? అసలు అమ్మాయిల తలలను తీసుకెళ్లి ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడు..? అసలు దిష్టిబొమ్మలకు ఈ హత్యలకు సంబంధం ఏంటి.? పురాణాలకు ఈ హత్యలకు ఉన్న లింక్ ఏంటి.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా ఆద్యంతం ట్విస్టులతో ఆసక్తిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో మూవీ చూసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read: ఆ ఓటీటీలోకి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'చూసీ చూడంగానే..' మూవీతో ఎంట్రీ ఇచ్చారు శివ కందుకూరి. గమనం, మనుచరిత్రతో పాటు హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్‌లో నటించారు. శర్వానంద్ హీరోగా నటించిన 'మనమే' మూవీలో గెస్ట్ రోల్ చేశారు. ప్రస్తుతం తెలుగులో బూమ్ రాంగ్ పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

