అన్వేషించండి

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..

Pawan Kalyan Movie: పవన్ 'హరిహర వీరమల్లు' నుంచి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.

Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie Kollgottinadiro Song Promo: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఫస్ట్ పార్ట్‌ను 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మూవీకి సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' పాటను ఈ నెల 24న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా.. ఆ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు.

'కొరకొర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె జనుగులతో..' అంటూ సాగే జానపద గీతం ప్రోమో ఆకట్టుకుంటోంది. మీసాలు తిప్పుతూ లిరిక్స్‌కు అనుగుణంగా పవన్ శ్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటలో పవన్‌తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ కలిసి కాలు కదిపారు. చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. మంగ్లీ ఆలపించారు. ఆమెతో పాటు రాహుల్ సిప్లిగంజ్, రమ్యబెహరా, యామిని ఘంటసాల కూడా ఈ పాటకు గొంతు కలిపినట్లు తెలుస్తోంది. పూర్తి పాట ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

Also Read: ఆ ఓటీటీలోకి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు'.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుందుతోంది. అయితే, క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం పవన్ ప్రజా పాలనలో బిజీగా ఉండడంతో అనుకున్న టైంకు మూవీ రిలీజ్ చేస్తారా..? లేదా..? అనే దానిపై సందేహాలు నెలకొనగా.. చెప్పిన టైంకే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.

Also Read: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget