Dakshina OTT Streaming: అమ్మాయిలే టార్గెట్‌గా నగరంలో సైకో కిల్లర్ అరాచకం - ఆ పోలీస్ ఆఫీసర్ చెక్ పెట్టిందా?, ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
Dakshina OTT Platform: రజినీకాంత్ 'కబాలి'లో నటించిన సాయి ధన్సిక లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దక్షిణ'. తాజాగా ఈ మూవీ 'లయన్స్‌గేట్ ప్లే' ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.

Sai Dhanshika's Dakshina Now Streaming On Lionsgate Play: మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో రిలీజైన 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కబాలి' మూవీలో నటించిన నటి సాయి ధన్సిక (Sai Dhanshika) ఆ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆమె ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'మంత్ర' ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ధన్సిక లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దక్షిణ' (Dhakshina). గతేడాది అక్టోబర్ 4న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫాం 'లయన్స్‌గేట్ ప్లే' (Lionsgate Play) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Action, adrenaline, and pure thrill! 🔥💥#Dhakshina is now streaming on #LionsgatePlay – gear up for an action-packed ride. Watch now! 🎬🍿 pic.twitter.com/6JKiFKW1JR
— Lionsgate Play (@lionsgateplayIN) February 21, 2025
కథేంటంటే..?
ఓ మహానగరంలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్య చేస్తుంటాడు. సంబంధిత కేసును ఏసీబీ దక్షిణ (సాయి ధన్సిక) టేకప్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి..?, ఈ క్రమంలో ఊహించని విధంగా ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. దీంతో పోలీస్ జాబ్‌కు రిజైన్ చేసి మద్యానికి బానిసవుతుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి.?, ఆ కిల్లర్‌కు, దక్షిణకు ఉన్న సంబంధం ఏంటి.? సైకో కిల్లర్‌ను ఆమె పట్టుకుందా.? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మరో ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్
ప్రముఖ నటి ఇంద్రజ, దర్శకుడు కరుణ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'కథా కమామీషు'. గౌతమ్ - కార్తీక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా 'ఆహా' (Aha) ఓటీటీలో ఈ ఏడాది జనవరి 2న విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో ఓటీటీ 'సన్ నెక్స్ట్'లోనూ (Sun NXT) స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లైన 4 జంటల మధ్య సాగే కథే ఇది. వైవాహిక జీవితంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు.?, వాటినెలా అధిగమించారనేదే ఈ సినిమా కథ. పూర్తి స్థాయి మెలో డ్రామాగా కాకుండా కామెడీకే మూవీలో పెద్ద పీట వేశారు.






















