Sharwa 37 is Nari Nari Naduma Murari: బాలయ్య క్లాసిక్ మూవీ టైటిల్‌కు ఫిక్సయిన శర్వానంద్... రామ్ చరణ్ సపోర్ట్ కూడా, ఫస్ట్ లుక్ చూశారా?
Sharwa 37 Movie Title: శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 37వ చిత్రానికి సంక్రాంతిని పురస్కరించుకుని టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా బాలయ్య, రామ్ చరణ్ కలిసి విడుదల చేశారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచిన మూవీ టైటిల్‌ని.. చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ని నటసింహం బాలయ్య ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయడంతో.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? బాలకృష్ణ, శోభన, నిరోషా కాంబినేషన్‌లో 1990లో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే టైటిల్‌తో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శర్వానంద్ 37వ చిత్రానికి బాలయ్య క్లాసిక్ టైటిల్ అయిన ‘నారీ నారీ నడుమ మురారీ’ టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ.. సంక్రాంతి స్పెషల్‌గా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి కానుకగా నటసింహం నందమూరి బాలకృష్ణ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే... టైటిల్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అనేలా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇద్దరు భామల మధ్య శర్వానంద్ నలిగిపోతున్నట్లుగా చూపించారు. ఇంతకీ ఆ ఇద్దరు నారీమణులు ఎవరనేగా మీ డౌటు. ఇంకెవరు.. సంయుక్త, సాక్షి వైద్య. ఈ ఇద్దరి మధ్య శర్వానంద్ గందరగోళ పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లుగా ఈ పోస్టర్‌లో చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
ఈ పోస్టర్‌ని గమనిస్తే.. నారీమణులిద్దరూ శర్వానంద్ షర్ట్ పట్టుకుని చెవుల్లో గట్టిగా అరుస్తుంటే.. అతను చెవుల్ని మూసేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వాళ్ల అరుపుకి పక్కనున్న పేపర్స్ కూడా లేచి కిందపడిపోతున్నాయి. ఈ పోస్టర్ ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ డ్రామా అనే విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తోంది. ఇద్దరు నారీమణులు తమదైన హావభావాలతో అరుస్తుంటే.. ఈ ప్రపంచంతో నాకేం పనిలేదు అనేలా.. అమాయకపు చూపులతో శర్వా ఇందులో కనిపిస్తున్నాడు. పోస్టర్ కలర్‌ఫుల్ వైబ్‌ని ప్రసరింపజేస్తోంది. శర్వానంద్ నుండి ఈ తరహా ప్రాజెక్ట్ అయితే ఊహించనిదే అని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. పైగా బాలయ్య, రామ్ చరణ్ సపోర్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
ఇరువురు భామల కౌగిలిలో స్వామి ,
— AK Entertainments (@AKentsOfficial) January 14, 2025
ఇరుకున పడి నీవు నలిగితివా 😉
Here's the festive treat you've been waiting for,
Presenting #Sharwa37 Title & First look - #𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐝𝐮𝐦𝐚𝐌𝐮𝐫𝐚𝐫𝐢 🎭❤️🔥
Festive fun begins now, while the full laughter riot comes your way soon! 🔥❤️… pic.twitter.com/EXrGMXYfYN
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆనందకరమైన, ఉల్లాసకరమైన రైడ్‌కు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం, జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ, భాను బోగవరపు కథ, నందు సావిరిగణ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రధాన నటీనటులు పాల్గొంటున్నట్లుగా చిత్రయూనిట్ తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్‌కు ఈ సినిమా విజయం సాధించడం ఎంతో కీలకం. ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈసారి శర్వాకు హిట్ వచ్చేలానే ఉంది.