అన్వేషించండి
MadhaviLatha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు మాధవీలత ఫిర్యాదు, టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్
JC Prabhakar Reddy | తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, హెచ్ఆర్సీకి నటి మాధవీలత ఫిర్యాదు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు, అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
Source : X
JC Prabhakar Reddy | హైదరాబాద్: మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కి ఫిర్యాదు చేశారు. సినిమాలో నటిస్తున్న మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు. ఈ మేరకు MAA ట్రెజరర్, నటుడు శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం సమర్పించారు మాధవీలత.
తాను ఆవేశంలో ఏదో మాట్లాడేశానని, తనకు మహిళలంటే గౌరవమని.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ సైతం కోరారు. వయసులో పెద్దవాడినని, కానీ ఎవర్నీ కించ పరచడం తన ఉద్దేశం కాదన్నారు. తనపై దారుణంగా మాట్లాడారని, ఇలాంటి పనులు చేస్తే ప్రజలు హర్షించరని మాధవీలత అన్నారు. తనపై జేసీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బదులుగా ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి చర్యలు తీసుకునేలా ‘మా’కు కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది.
పోలీసులకు ఫిర్యాదు చేశా- మాధవీలత
‘జేసీ ప్రభాకర్‌రెడ్డి నాపై దారుణంగా మాట్లాడారు. కానీ నటిపై అంత దారుణ వ్యాఖ్యలు చేసినప్పుడు, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఖండించలేదు. హెచ్‌ఆర్సీ, పోలీసులకు సైతం ఫిర్యాదు చేశా. అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కు ఫిర్యాదు చేశా. ఈ విషయంపై 'మా' ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేయగా ఆయన స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి శివబాలాజీ తీసుకెళ్లారు. వ్యక్తిత్వ హననడం చేయడం దారుణం’ అన్నారు మాధవీలత.
‘జేసీ ప్రభాకర్‌రెడ్డి నాపై దారుణంగా మాట్లాడారు. కానీ నటిపై అంత దారుణ వ్యాఖ్యలు చేసినప్పుడు, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఖండించలేదు. హెచ్‌ఆర్సీ, పోలీసులకు సైతం ఫిర్యాదు చేశా. అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కు ఫిర్యాదు చేశా. ఈ విషయంపై 'మా' ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేయగా ఆయన స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి శివబాలాజీ తీసుకెళ్లారు. వ్యక్తిత్వ హననడం చేయడం దారుణం’ అన్నారు మాధవీలత.
మాధవీలత ఫిర్యాదుపై MAA ట్రెజరర్ శివబాలాజీ స్పందించారు. సినిమా వాళ్లపై ఆరోపణలు, దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయ నాయకలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, వాటిని పరిష్కరించాలి అన్నారు. కానీ వేరొకరి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదని, రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాధవీలత చేసిన ఫిర్యాదుపై‘ మా’ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం అలా మొదలైంది..
న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళలకు మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దని సూచిస్తూ మాధవీలత ఓ వీడియోని రిలీజ్ చేశారు. అక్కడ జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్ లు ఉంటాయని, మీపై దాడులు చేస్తే ఎవరిది బాధ్యత? అని మహిళను అలర్ట్ చేశారు. కనుక ఆడపిల్లలు ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మాధవీలత చెప్పారు. హీరోయిన్ గా షూటింగ్స్ కు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేశావు, నీ సంగతి మాకు తెలుసు అంటూ మాధవీలతపై దారుణమైన కామెంట్లు చేశారు. ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నావా అంటూ తీవ్రమైన పదాలు జేసీ వాడారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఎవరూ మద్దతు తెలపలేదని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ తాను చేసిన కామెంట్లు వెనక్కి తీసుకుంటున్నానని, తన మాటలతో బాధపడిన మాధవీలతకు వీడియోలో మాట్లాడుతూ క్షమాపణ సైతం చెప్పారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
ఐపీఎల్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion