JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Pasupuleti Maadhavi Latha | బీజేపీ నేతలతో వివాదానికి చెక్ పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను ఏదో ఆవేశంలో మాట్లాడేశానంటూ నటి మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ క్షమాపణ చెప్పారు.
JC Prabhakar Reddy apologizes to actress Madhavi latha | తాడిపత్రి: గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి నేతలు అన్నట్లుగా పేలుతున్న మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ పార్టీల నేతల బహిరంగంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏదో ఆవేశంలో మాట్లాడేశా, క్షమించండి
తాజా వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటి మాధవిలతపై ఏదో ఆవేశంలో మాట్లాడాను. నేను మాధవిలత మీద టంగ్ స్లిప్ అయ్యాను. అందుకుగానూ క్షమాపణలు చెబుతున్న. తాడిపత్రి కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. తాడిపత్రి ప్రజలే నాకు సైన్యం. నియోజకవర్గ ప్రజలు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. పేర్కొన్నారు. ఈరోజు నా మీద మాట్లాడే ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలో ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్లే.
గత రెండు రోజులుగా నాపై మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి చెబుతున్నాను. కొందరు పార్టీ మారతాడని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. కేవలం నేను సీఎం చంద్రబాబు నాయుడు విజయం చూసి ఈ పార్టీలో ఉన్నాను. చంద్రబాబు మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలోనని అహర్నిశలు కష్టపడుతున్నారు. అదే విధంగా నేను తాడిపత్రిని డెవలప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాను. మరో రెండు సంవత్సరాలలో తాడిపత్రిని ది బెస్ట్ గా చూపిస్తాను.
తాడిపత్రి అభివృద్ధి కోసం నేను జోళె పట్టి రోడ్డు మీదకు వెళ్ళినా కూడా ప్రజలు కోట్లు కుమ్మరిస్తారు. నామీద అవాకులు చెవాకులు పేలుతున్న వారందరికీ చెబుతున్న.. మీరు మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయండి. లేకపోతే నామరూపాలు లేకుండా పోతారు. పదవి పోయిన తర్వాత మీ పక్కన కనీసం ఒక్కడు కూడా ఉండడంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
అంత నీచుడ్ని కాదు.. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా
తాను అంత నీచుడ్ని కాదని, ధైర్యంగా మాట్లాడతా. ధైర్యంగా ఉంటానన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని, ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. వయసులో పెద్దవాడ్ని అయినా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మాధవిలతపై అలాంటి వ్యాఖ్యలు చెప్పినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరో ఫ్లెక్సీగాళ్లు మాట్లాడితే తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిన్నా మొన్నా వచ్చినోళ్లు కూడా తనపై కామెంట్లు చేస్తున్నారని.. చంద్రబాబు విజన్ చూసి పార్టీలో కొనసాగుతున్నారు. అమరావతి మిషన్ సక్సెస్ చేస్తారు. డెవలప్ మెంట్‌లో చంద్రబాబుతో పోటీ పడతాను. నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు. పదవి పోయాక మీరు గన్ మెన్లను వెంట పెట్టుకుని బయట తిరగాల్సి వస్తోంది జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాడిపత్రి ప్రజలను వదిలి వెళ్లేది లేదు. తన పార్టీనే తాడిపత్రి అని రెండేళ్లలో తాడిపత్రిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని స్పష్టం చేశారు.