Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Ticket Price Hiked For Daaku Maharaaj Movie | నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Daaku Maharaaj Movie Ticket Rate Hike | అమరావతి: నందమూరి బాలకృష్ట లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య మూవీ డాకు మహారాజ్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
4 గంటలకు బెనిఫిట్ షో, టికెట్ ధరలు ఎంత పెరిగాయంటే..
జనవరి 12న సినిమా విడుదల కానుండగా.. అదే రోజు ఉదయం 4 గంటల ప్రత్యేక షో వేయడానికి, టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో ఒక్కో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.500గా ఫిక్స్ చేశారు. డాకు మహారాజ్ విడుదల నుంచి మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరపై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 వరకు ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 25 వరకు పెరిగిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు ఇందుకు సంబంధించి రూల్స్ పాటించాలని సూచించారు.
డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది..
బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'డాకు మహారాజ్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా సినిమా నిర్మించారు. డాకు మహారాజ్ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మంచి పాటలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'చెడ్డ వాళ్లు ఆయనను డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు' అని ఓ చిన్నారి కథ చెబుతుండగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ పరిచయం చేశారు.
Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
సినీ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త పాలసీ
ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సినీ పరిశ్రమ అభివృద్ధి కోరుకుంటారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరం సమీపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సినిమా వాళ్లను రాజకీయాల్లోకి లాగకూడదని, సినిమా హీరోలు ప్రభుత్వం వద్దకు వచ్చి చేతులు జోడించి అడగాల్సిన పనిలేదన్నారు. మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధర పెంపునకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి ఒంటి గంట బెనిఫిట్ ఫోకు సైతం అనుమతి ఇస్తూ జీవో జారీ చేశారు.