K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
Kerala: సాధించాలనే పట్టుదల ఉండాలి కానీ కొండంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని అయినా సులువుగా సాధిస్తారు. కేరళకు చెందిన శ్రీనాథ్ అలాంటివాడే.

Srinath worked as a porter at a railway station and attained IAS : వీధి దీపాల కింద చదువుకుని పైకి వచ్చారని మహనీయుల గురించి మనం పాఠాలుగా చదువుకుని ఉంటాం. అప్పట్లో కరెంట్ కొరత కాబట్టి .. ధనవంతుల ఇళ్లకే కరెంట్ సరఫరా ఉంటుంది కాబట్టి అలా చదువుకునేవారు. మరి ఈ రోజుల్లో ఏం చేస్తారు ?. ఈ రోజుల్లో అయితే రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫైతో ఆ ఘనత సాధిస్తున్నారు. రైల్వేలో పోర్టర్‌గా పని చేస్తూ స్టేషన్‌లో లభించే ఫ్రీ వైఫై సాయంతో మొబైల్ ఫోన్లలో చదువుకున్న యువకుడు.. ఐఏఎస్ సాధించారు.
కేరళకక చెందిన కె.శ్రీనాథ్ అనే యువకుడు తన నాలుగో ప్రయత్నంలో సివిల్స్ లో ర్యాంక్ సాధిచారు. అతనికి లభించిన ర్యాంక్ ఆధారంగా ఐఏఎస్ ఖరారు అయింది. అయితే చాలా మంది ఐఏఎస్ సాధిస్తూంటారు అందులో గొప్పేముంది అనుకోవచ్చు. అది నిజమే. చాలా మంది ఐఏఎస్ సాధిస్తూ ఉంటారు. కానీ శ్రీనాథ్ సాధించడం ప్రత్యేకం. ఎందుకంటే ఆయన పోర్టర్‌గా పని చేసేవారు.
కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పని చేస్తే శ్రీనాథ్‌కు చదువు అంటే ఇష్టం. మంచి ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కుటుంబంలో సంపాదించాల్సింది తాను ఒక్కటే. దీంతో రోజుకు ఐదు వందల వరకూ సంపాదించగలిగే పోర్టర్ పనిని వదులుకోలేదు. అలాగని తన లక్ష్యాన్ని కూడా వదులుకోలేదు. దేనిపని దానిదే అన్నట్లుగా కష్టపడ్డాడు. అతి కష్టం మీద ఓ స్మార్ట్ ఫోన్ కొొనుక్కుని. రైల్వేస్టేషన్‌లో లభించే ఫ్రీ వైఫైతో ప్రిపేర్ కావడం ప్రారంభించాడు. చివరికి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాసై మంచి ఉద్యోగం సాధించాడు.అయితే అది శ్రీనాథ్ కు అంత సంతృప్తి ఇవ్వలేదు. తన స్థాయికి ఖచ్చితంగా సివిల్స్ కరెక్ట్ అని గట్టిగా నమ్మాడు. అనుకున్న విధంగా ప్రయత్నాలు చేశాడు. మూడు సార్లు ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించాడు.
శ్రీనాథ్ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత అతను సాధించిన విజయం అన్యసామాన్యమైన విజయం సాధించారని ప్రశంసిస్తున్నారు. పోర్టర్ గా పని చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో శారీరక శ్రమ ఉంటుంంది. అయినప్పటికీ పన్నెండు గంటలు పోర్టర్ గా పని చేసుకుని మిగిలిన సమయంలో చదువుకుని ఐఏఎస్ సాధించినా శ్రీనాథ్ కు.. ప్రైడ్ ఆఫ్ కేరళగా పిలుస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

