Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
TDP Lokesh : నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ టీడీపీలో పెరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఆ డిమాండ్ వినిపించారు.

Nara Lokesh the Deputy CM: తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలోనే మాట్లాడిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి .. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు లోకేష్ శ్రమిస్తున్నారని ఆయన అంటున్నారు. భవిష్యత్‌లో పార్టీకి యువతకు భరోసా ఇచ్చేందుకు లోకేష్ ఉంటారని ఆయనను డిప్యూటీ సీఎంగా చేయాలన్నారు.
గత వారం మహాసేన రాజేష్ లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్
లోకేష్ డిప్యూటీ సీఎం నినాదం వినిపించింది రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి మాత్రమే కాదు .. మహాసేన రాజేష్ కూడా గత వారం ఇదే వాదన వినిపించారు. నారాలోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కోసం, ప్రభుత్వంలో మంత్రిగావిస్తృతంగా పనిచేస్తున్నారని అంటున్నారు. పార్టీ భవిష్యత్ అవసరాల కోసం డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు. వ్యూహాత్మకంగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఈ వాదన తీసుకు వస్తున్నారు.
పవన్ తో పోలిస్తే లోకేష్ వెనుకబడుతున్నారని అనుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కల్యాణ్ డామినేషన్ పెరుగుతుంందన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ పోటీగా రాజకీయాలు చేస్తున్నారని సొంత ఇమేజ్ పెంచుకుంటున్నారని.. ప్రతీ విషయంలోనూ తానే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే నారా లోకేష్ వెనుకబడిపోతారన్న ఉద్దేశంతో ఆయనను కూడా ప్రమోట్ చేయాలని వ్యూహాత్మకంగా డిమాండ్ చేస్తున్నారని భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా లేకపోయినప్పటికీ నారా లోకేష్.. కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాటే చెల్లుబాటు అవుతోందని చెబుతారు.
డిప్యూటీ సీఎంగా లేకపోయినప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్
చీఫ్ సెక్రటరీగా ఎంపిక సహా..త పలు అంశాల్లో లోకేష్ సిఫార్సులకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. పెట్టుబడుల కోసం లోకేష్ స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గట్లుగా డిప్యూటీ సీఎం ఇవ్వాలని అంటున్నారు. నిజానికి డిప్యూటీ సీఎం అనేది కేవలం ఓ ప్రకటిత పదవి తప్ప ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది కూడా లేదు. అయినా టీడీపీ నేతల డిమాండ్ మాత్రం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్ చేసినప్పుడు చంద్రబాబు వేదికపై ఉన్నారు కానీ ఎలాంటి స్పందన వ్యక్తంచేయడం లేదు. చివరికి చంద్రబాబు ఆలోచనల మేరకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

