అన్వేషించండి

BCCI 10 Points Guidelines: పది పాయింట్ల గైడ్ లైన్లపై భజ్జీ ఫైర్.. చర్చను పక్కదారి పట్టించొద్దని బోర్డుకు చురకలు

BCCI :టెస్టుల్లో ఘోర ప్రదర్శన చేస్తున్న టీమిండియాను గాడిన పెట్టేందుకు బీసీసీఐ నిబంధనలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనీపై హర్భజన్ మాట్లాడాడు. అసలు వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. 

Team India News: బీసీసీఐ తాజాగా ప్రకటించిన పది పాయింట్ల గైడ్ లైన్స్ పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫైరయ్యాడు. టీమిండియా ఓటముల నుంచి పక్కదారి పట్టించడంలో భాగంగానే వీటిని తెరపైకి తెచ్చారని పేర్కొన్నాడు. గతేడాది నుంచి భారత జట్టు ఘోర ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయింది. అది కూడా దశభ్దాల పాటు కనీసం టెస్టు మ్యాచ్ కూడా నెగ్గని న్యూజిలాండ్ జట్టుకు కావడం గమనార్హం. అది కూడా క్లీన్ స్వీప్ కు గురైంది. అలాగే ఆసీస్ టూర్లో 1-3తో టెస్టు సిరీస్ ఓడిపోయి, పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే దీనిపై భజ్జీ పెదవి విరిశాడు. 

ఇవన్నీ కామనే..
బీసీసీఐ మార్గదర్శకాల గురించి మీడియాలో చదివి తెలుసుకున్నానని, తాను ఆడే రోజుల్లో ఇవన్నీ ఉండేవని హర్భజన్ చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో ఉన్నవి ఇప్పుడెందుకు మార్చారో, వాటికి గల కారకులెవరో వారిపై చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఇక క్రికెటర్ల కుటుంబ సభ్యులు విదేశీ టూర్లలో ఉండటంతో జట్టు ఓడిపోలేదని, ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడంతోనే జట్టు పరాజయం పాలైందని గుర్తు చేశాడు. ఆన్ ఫీల్డులో జరిగిందన్ని పక్కన పెట్టి, ఆఫ్ ఫీల్డ్ విషయాలపై ఫోకస్ పెట్టడం సరికాదని వ్యాఖ్యానించాడు. మరోవైపు తాను చూసిన మార్గదర్శకాల్లో 150 కేజీల లగేజీ మాత్రమే కొత్తగా అనిపించిందని పేర్కొన్నాడు. ఏదేమైనా జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలని భజ్జీ పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు. 

సచిన్, గంగూలీ అలా ఎప్పుడు చేయలేదు..
తాము క్రికెట్ ఆడే రోజుల్లో ఒక మ్యాచ్ రెండు, మూడు రోజుల్లో ముగిసిపోయి, తర్వాత మ్యాచ్ కు కాస్త ఎక్కువ సమయం ఉంటే జట్టుతోనే ఉండేవాళ్లమని భజ్జీ తెలిపాడు. సమయం దొరికింది కదా అని ముంబైకి సచిన్ టెండూల్కర్, కోల్ కతాకు సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ కు వీవీఎస్ లక్ష్మణ్, బెంగళూరుకు రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోయేవాళ్లు కాదని పేర్కొన్నాడు. పూర్తి సిరీస్ ముగిసే వరకు జట్టుతోనే ఉండేవాళ్లమని పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లకు ఇప్పటివరకు బోర్డు ఎన్నో వెసులుబాటులు కల్పించింది. ఇకపై నుంచి అలాంటి వాటికి చోటు ఉండదని తాజాగా పదిపాయింట్ల రూల్స్ ను ప్రకటించింది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో వెళ్లిపోవడం, ప్రాక్టీస్ సెషన్ మొత్తం గడప కుండా ఉండటం వాటికి చెల్లుచీటీ పడింది. అలాగే దేశవాళీల్లో పాల్గొనడం కూడా తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా యువ ఆటగాళ్లకు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. 
మరోవైపు టూర్లలో తమ సహాయక సిబ్బందిని తెచ్చుకునే వెసులుబాటును కూడా ఉపసంహరించుకుంది. మేనేజర్, చెఫ్, సహాయకులు, భద్రతా సిబ్బంది  తదితర సౌకర్యాలను ఉపయోగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. జట్టులో అందరూ సమానంగా ఉండాల్సిందేనని, ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పింది. అలాగే పర్యటనల్లో వ్యక్తిగత షూట్లు, ఎండార్స్ చేయకూడదని తెలిపింది. బీసీసీఐ రూపొందించే అన్ని షూట్లలోనూ ప్లేయర్లంతా పాల్గొనాల్సిందేనని కండీషన్లు పెట్టింది. తాజా కఠిన నిబంధనలతో ఆటగాళ్లలో క్రమశిక్షణ పెరుగుతుందని బోర్డు భావిస్తోంది. 

Also Read: Delhi Capitals: రాహుల్ కి షాక్.. కెప్టెన్సీ రేసు నుంచి తప్పించిన యాజమాన్యం..!! భారత స్టార్ ఆల్ రౌండరే నూతన సారథి..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Hyderabad Metro Rail: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
Chhattisgarh Encounters: తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Hyderabad Metro Rail: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
Chhattisgarh Encounters: తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Telugu TV Movies Today: బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
RR New Captain For First 3 Games: రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
Embed widget